రాష్ట్రీయం

భూములిచ్చి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతిని అద్భుత నగరం చేస్తా వారసత్వ నగరానికి 50.62 కోట్లు పైలాన్ ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు

గుంటూరు, డిసెంబర్ 5: ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులను ఆదర్శంగా తీసుకుని వారసత్వ నగరాన్ని తీర్చిదిద్దేందుకు భూములివ్వాలని సిఎం చంద్రబాబు కోరారు. శనివారం అమరావతిలో వారసత్వ నగరాభివృద్ధికి కేంద్రం హృదయ్, ప్రసాదు పథకాల ద్వారా మంజూరైన రూ.50.62కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పైలాన్‌ను సిఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య ఆవిష్కరించారు. సిఎం బాబు మాట్లాడుతూ ధ్యానబుద్ధ వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన 16 ఎకరాల రైతులు కోర్టులను ఆశ్రయించారని, వారంతా ముందుకొచ్చి భూములిస్తే అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మీకు అన్యాయం చేయను, న్యాయమే చేస్తాను. అందువల్ల రైతులు ముందుకొచ్చి కేసు ఉపసంహరించుకోమని కోరారు. ధరణికోటను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, హిమాలయన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తున్నందున 50 ఎకరాలు భూసమీకరణ ద్వారా రైతులు భూములిస్తే తీసుకుంటామన్నారు. కృష్ణానదిపై మరొక బ్యారేజీ నిర్మిస్తే అమరావతి నుంచి నేరుగా విజయవాడకు బోట్లపై ప్రయాణం చేసేందుకు అవకాశం ఉందన్నారు. క్రీస్తుశకం 2, 3 శతాబ్దాల్లో అశోక చక్రవర్తి పరిపాలించిన సమయంలో 100 అడుగుల ఎత్తు, 160 అడుగుల వైశాల్యంతో మహాస్థూపం నిర్మించారని, ఆచార్య నాగార్జునుడు ఇక్కడి నుంచే బుద్ధిస్ట్ యూనివర్సిటీ ద్వారా బౌద్ధమతాన్ని చైనా, జపాన్, ఇండోనేషియా తదితర దేశాల్లో విస్తరించే విధంగా కృషి చేశారన్నారు.
అమరావతికి పేరు, వాస్తు బలం ఉందని, ప్రపంచవ్యాప్తంగా అమరావతికి చరిత్రలో ఎప్పటి నుంచో గుర్తింపు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు ప్రకటించగానే వందశాతం హర్షం వ్యక్తం చేశారన్నారు. అమరావతి పేరు బలం వల్లనే అన్ని సమకూరుతున్నాయని, సింగపూర్ దేశం ఉచితంగా మాస్టర్ ప్లాన్ అందజేసిందన్నారు. అందువల్ల రాజధాని అమరావతిని చూసేందుకు వచ్చే ప్రతి పర్యాటకుడూ అమరావతిలోని శ్రీ అమర లింగేశ్వస్వామిని దర్శించుకుని, ధ్యానబుద్ధ ప్రాజెక్టును తిలకించే విధంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. హృదయ్ పథకం ద్వారా రూ. 22.26కోట్లు, ప్రసాదు పథకం ద్వారా 28.36కోట్లు కేంద్రం అందజేసిందన్నారు. వాటితోపాటు అవసరమైతే మరిన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి అభివృద్ధి చేస్తుందన్నారు. అమరావతి, బెల్లంకొండ మేజర్‌ల చివరి భూములు కావటంతో సాగు నీరు అందటంలేదని, బోదనం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి పొలాలకు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్టమ్రంత్రులు పాల్గొన్నారు.
(చిత్రం)వారసత్వ నగరం పైలాన్‌ను ఆవిష్కరిస్తున్న చంద్రబాబు