రాష్ట్రీయం

జంటనగరాల్లో పదివేల సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని, జంటనగరాల్లో పదివేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయదలచామని పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. శనివారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 77 కమ్యూనిటీ సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపాంతరం చెందుతుందన్నారు. త్వరలో మెట్రో రైలును నగర శివారులకు కూడా విస్తరింపజేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా నగరంలో ఒక గూగుల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సిఇఓ సుందర్ పిచ్ఛయ్ ప్రకటించారన్నారు. అభివృద్ధి వైపు పయనిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కొందరు ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని అది సమంజసం కాదన్నారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసం పొందిందన్నారు. విశ్వనగరం విజన్‌గా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వం వౌలిక వసతులతోపాటు ఉపాధి కల్పనకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలువనుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నగరంలో 36 మోడల్ మార్కెట్లు నిర్మించేందకు చర్యలు తీసుకుంటున్నారని, మంచినీటి సరఫరా కోసం 30టిఎంసి సామర్థ్యం గల రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారని మంత్రి కెటిఆర్ చెప్పారు.