రాష్ట్రీయం

ఐటి.. మనమే సాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి కేంద్రంగా తెలంగాణ
28న 4 కొత్త పాలసీలు
28న సత్య నాదెళ్ల రాక
ఐటి మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 5: దేశానికి ఐటి కేంద్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటోందని ఐటి మంత్రి కె తారక రామారావు అన్నారు. మాదాపూర్‌లో శనివారం యానిమేషన్ అండ్ గేమింగ్ ఇంక్యూబేటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తుఫాన్లు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల భయంలేని అద్భుత ప్రాంతం హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్‌ను ఐటి రంగానికి చిరునామాగా మారుస్తామన్నారు. దేశంలో మరే ప్రాంతంలోనూ లేనివిధంగా హైదరాబాద్ సౌకర్యవంతమైన ప్రాంతమన్నారు. ఈనెల 28న మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్ల హైదరాబాద్‌కు వస్తున్నారని కెటిఆర్ తెలిపారు. టి-హబ్‌లోని స్టార్టప్‌లను పరిశీలిస్తారని, వారితో చర్చిస్తారని కెటిఆర్ తెలిపారు. 28న తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగానికి సంబంధించి నాలుగు పాలసీలను ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ పాలసీల ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాకుండా హార్డ్‌వేర్ రంగంలోనూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనేది లక్ష్యమన్నారు. ఐటి పాలసీ, గేమింగ్ పాలసీ, హార్డ్‌వేర్ పాలసీ, ఇమేజ్ పాలసీలను 28న ప్రకటించనున్నట్టు చెప్పారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, హైదరాబాద్‌ను ఐటి రంగంలో దేశానికే కేంద్రంగా మార్చడం లక్ష్యమన్నారు. ఏరోస్పేస్ ఇంక్యూబేషన్‌పై సిఎం దృష్టి సారించారని తెలిపారు. తెలంగాణలో పలు పరిశ్రమలు రానున్నాయని, వీటివల్ల ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. ప్రైవేటు రంగం, ప్రభుత్వం పరస్పర సహకారంతో ఐటి రంగం అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఇమేజ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశంలోనే అత్యంత సురక్షితమైన హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని కెటిఆర్ తెలిపారు.