రాష్ట్రీయం

స్ఫూర్తిప్రదాత కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించిన రిట్జ్-సిఎన్‌ఎన్ ఐబిఎన్
బడ్జెట్‌లో ఇన్నోవేషన్ ఫండ్: మంత్రి వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 3: ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు రిట్జ్-సిఎన్‌ఎన్ ఐబిఎన్ సంస్థలు సంయుక్తంగా మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశాయ. ప్రజాజీవితంలో సాధించిన పురోగతికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
పాలనలో ఉత్తమ ప్రమాణాలు, ప్రజల అవసరాలు తెలిసిన నూతన తరం నాయకుడని ప్రశంసించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది గుర్తింపు అని కెటిఆర్ పేర్కొన్నారు. డిసెంబర్ 13న బెంగళూరు తాజ్ వెస్టెండ్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కెటిఆర్ అందుకోనున్నారు. ప్రజల అవసరాలపై అపారమైన అవగాహన ఉన్న కొత్తతరం రాజకీయ నాయకుడిగా మంత్రి కెటిఆర్‌ను అభినందిస్తూ కెటిఆర్‌కు ఈ-మెయిల్ చేశారు. కెటిఆర్‌తోపాటు వ్యాపార రంగంలో గ్రంధి మల్లికార్జున రావు, సినిమా రంగంలో చరణ్ తేజ్, విద్యా బాలన్, ప్యాషన్ రంగంలో గౌరంగ్ షా, సాంకేతిక రంగంలో నందన్ నిలేకర్‌కు అవార్డులు ప్రకటించారు.
వచ్చే బడ్జెట్‌లో ఇన్నోవేషన్ ఫండ్
వచ్చే బడ్జెట్‌లో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కె తారక రామారావు తెలిపారు. నానక్‌రామ్ గూడ నుంచి విప్రో సర్కిల్ వరకు రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ ఐదవ తేదీన గేమింగ్ ఇంక్యుబేషన్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు.