కృష్ణ

జగన్ దుర్మార్గపు పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దుర్మార్గపు పాలనపై కేంద్రం జోక్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక బస్టాండ్ సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై టీడీపీ శ్రేణులు బైఠాయించటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమాలను సీఎం జగన్ అణచివేస్తున్నారంటూ రవీంద్ర మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడే హక్కులన్ని సైతం హరించే విధంగా జగన్ పాలన సాగుతోందని గర్హించారు. విశాఖ విమానాశ్రయం వద్ద తమ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి చేయించిన ఘటనపై కేంద్రం స్పందించి వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నిరంకుశ పాలనపై తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్ (నాని), తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, పార్టీ నాయకులు బత్తిన దాస్, సాతులూరి నాంచారయ్య, పివి ఫణికుమార్, కోస్తా మురళి, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.