కృష్ణ

కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నగర పంచాయతీగా ఆవిర్భవించిన ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో పట్టణ సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన పుర ప్రాజె క్ట్ అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి పుర ప్రాజెక్ట్ అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన పుర ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ రూ.157కోట్లు అన్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్‌ను 2014లో చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో రూ.56.50కోట్లతో నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కింద ఇంటింటికి మంచినీటి సరఫరా, పూర్తి స్థాయి పారిశుద్ధ్యం క్యాంపైన్ ప్రొగ్రాం కింద రూ.5.45కోట్లతో మురుగునీటి పారుల నిర్వహణ, రూ.7.76కోట్లతో సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రూ.4.69కోట్లతో స్మార్ట్ వాటర్ డ్రైన్స్ అభివృద్ధి, రూ.13కోట్లతో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రూ.4.77కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రోడ్ల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు రూ.53.80కోట్లతో మెగా టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు, రూ.8కోట్లతో రెండు మెగా వాట్ల సోలార్ పవర్ జనరేషన్, హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియా ముడి సరుకు నిధి ఏర్పాటు, స్కిల్ డెవలప్‌మెంట్, గ్రామీణ సోలార్ లైట్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం పరిధిలో మల్కాపురంలో వాటర్ ట్రీట్‌మెంట్ ఫ్లాంట్ 1.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.9కోట్లతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరో రూ.9కోట్లతో భీమరాజు గుట్టపై రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. మంచినీటి సరఫరా అభివృద్ధికి రూ.56.50కోట్లుకు ప్రతిపాదనలు రూపొందిస్తే నిధులు మంజూరు కోసం కేంద్రాన్ని కోరతామన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు వేగవంతం చేయాలని నోడల్ ఏజెన్సీ డీఆర్‌డీఎ పీడీని కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2015 సంవత్సరంలో వాటర్ ఫిల్ట్రెషన్ ఫ్లాంట్ నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభించలేదన్నారు. దీన్ని వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. భీమరాజుగుట్టపై కూడా రిజర్వాయర్‌ను తక్షణం నిర్మించాలన్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో మంచినీటి వసతి మెరుగు పర్చేందుకు అవసరమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ భాస్కర శర్మ, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అసోసియేట్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.