కృష్ణ

సిఫార్సులు లేకుండానే ప్రభుత్వ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రభుత్వ సేవలకు ఎటువంటి సిఫార్సులు అవసరం లేదని, నిస్పక్షపాతంగా అర్హతలను బట్టే సేవలు అందుతాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని గోపువానిపాలెం, పెదయాదర, చినయాదర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గోపువానిపాలెం గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించనున్న తొమ్మిది సీసీ రోడ్లు, చిన యాదర, పెదయాదర గ్రామాల్లో రూ.61.50లక్షలతో నిర్మించనున్న 14 సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చే లోపు మంజూరు చేసిన సీసీ రోడ్ల నిర్మాణ పనులన్నింటినీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుండి పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో నాణ్యమైన రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. గోపువానిపాలెం గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారానికి గ్రామంలోని వలంటీర్లు సర్వే చేసి ఎక్కడెక్కడ కుళాయిలు అవసరమో గుర్తించాలన్నారు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్న తోటలకు విద్యుత్ సౌకర్యం మార్చి 15వతేదీ లోపు కల్పిస్తామన్నారు. చినయాదర గ్రామంలోనూ మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులకు సూచించారు. చినయాదరలో 5 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేస్తామన్నారు. నెల రోజుల్లో తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి నీటి సరఫరాను పెంపు చేస్తామన్నారు. పెదయాదర గ్రామస్థులు విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని ఆర్టీసీ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి సర్వీసు ఏర్పాటు చేయాలన్నారు. కో-ఆపరేటీవ్ సొసైటీ నిధులు రూ.4లక్షలతో గ్రామంలో ఆర్‌ఓ ఫ్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. 9వ ఛానల్ కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి పాత ఫుట్ బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గతంలో కాసా నిర్మించిన గృహాల శ్లాబు పెచ్చులూడిపోవటంతో వర్షా కాలంలో ఇళ్లన్నీ నీటితో నిండిపోతున్నాయని మంత్రికి తెలుపగా గృహ నిర్మాణ పథకం కింద గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాలు నిర్మించాలని, ఏటికట్ట కింద లంకలో 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరారు. ఈ పర్యటనలో డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, ఆర్‌డబ్ల్యుయస్, పీఆర్ ఎఇలు, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, ఎఎంసీ వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్ తదితరులు ఉన్నారు.