కృష్ణ

కేడీసీసీబీ ప్రతిష్ట పెంచుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్రంలోనే ఘనతకెక్కిన కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ బ్యాంక్ చైర్మన్‌గా నియమితులైన యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంక్‌లో శనివారం ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. యార్లగడ్డతో పాటు సభ్యులుగా నియమితులైన కొమ్మినేని రవిశంకర్, నల్లమోతు కోటి సూర్యప్రకాశరావు, వేములకొండ రాంబాబు, లకావతు జీత్య, గడిదేసి పెద వెంకయ్య, పడమట సుజాత కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రైతు సంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. బ్యాంక్ ద్వారా రైతులకు అవసరం మేర రుణ సదుపాయం కల్పించి వారికి అండగా నిలుస్తామన్నారు. పర్పస్ లేకుండానే రైతులకు రూ.10లక్షలు వరకు రుణాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై త్వరలో జరగనున్న బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది చైర్మన్‌లు పని చేశారని, నా తర్వాత ఎంతో మంది చైర్మన్‌లుగా పని చేస్తారన్నారు. కానీ తన హయాంలో మాత్రం తనకంటూ కేడీసీసీ చరిత్రలో ఒక పేజీని ఏర్పర్చుకుంటానన్నారు. కేడీసీసీబీ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా సేవలు అందిస్తానన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది సహాయ సహకారాలతో కేడీసీసీ బ్యాంక్‌కు మరింత ప్రతిష్ట తీసుకురానున్నట్టు చెప్పారు. నాబార్డు ద్వారా బ్యాంక్‌కు మరింత ఆర్థిక జవసత్వాలు తీసుకువస్తామన్నారు. గతంలో బ్యాంక్‌లో జరిగిన కుంభకోణాలపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. సహకార చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన యార్లగడ్డ వెంకట్రావ్‌ను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంక్ అభివృద్ధికి కలిసి కట్టుగా పని చేద్దామన్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఓ సమర్థవంతమైన వ్యక్తి అని, ఆయన నేతృత్వంలో బ్యాంక్ మరింత వృద్ధిలోకి వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి పేర్ని నాని వ్యక్తం చేశారు. మంత్రి పేర్ని నానితో పాటు డీసీఎంఎస్ చైర్మన్‌గా నియమితులైన వైసీపీ సీనియర్ నేత ఉప్పాల రాంప్రసాద్, జడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్ తాతినేని పద్మావతి తదితరులు కూడా యార్లగడ్డను కలిసి అభినందనలు తెలిపారు.