కృష్ణ

అదనంగా 10 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సదరం సర్ట్ఫికేట్లు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, విజయవాడ, నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఇకపై పది సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళ, బుధ, శుక్రవారాల్లో సదరం క్యాంప్‌లు జారీ చేయనున్నట్టు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డా. జ్యోతిర్మయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు మచిలీపట్నం, విజయవాడ, నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే మంగళ, శుక్రవారాల్లో సదరం సర్ట్ఫికేట్లు జారీ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మూడు ఆస్పత్రులతో పాటు జిల్లాలో ప్రత్యేకంగా గుర్తించిన అవనిగడ్డ, నందిగామ, మైలవరం, గన్నవరం, పామర్రు తిరువూరు, కైకలూరు, గూడూరు, ఉయ్యూరు, జగ్గయ్యపేట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా జారీ చేయనున్నట్టు తెలిపారు. మంగళవారం అవనిగడ్డ, నందిగామ, మైలవరం, గన్నవరం, పామర్రు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, బుధవారం తిరువూరు, కైకలూరు, గూడూరు, శుక్రవారం ఉయ్యూరు, జగ్గయ్యపేట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జారీ చేస్తారని తెలిపారు. సదరం సర్ట్ఫికేట్ల కోసం దివ్యాంగులు తమకు సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేయించుకోవాలన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో ఏ రోజు సదరం క్యాంప్‌కు హాజరు కావాలో వివరంగా ఉంటుందన్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధిలో విజయవాడ సీపీ ‘తిరుమలరావు’
మోపిదేవి, డిసెంబర్ 11: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. నాగపుట్ట పూజలను అర్చకులు సతీష్ శర్మ, విరూప్ శర్మ నిర్వహించగా ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్ కుమార్ శర్మ నిర్వహించారు. ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ ఎ మధుసూధనరావు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదములు అందజేశారు. అనంతరం గ్రామంలో రావి బాబూరావు నిర్మించిన శ్రీ ధైర్యలక్ష్మి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో సీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బిబి రవి కుమార్, ఎస్‌ఐలు వి సందీప్, టి సురేష్ బందోబస్తు నిర్వహించారు.