కృష్ణ

రోడ్ ఆడిటింగ్ ద్వారా ప్రమాదాల నివారణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ ఆడిటింగ్ చేస్తున్నామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రవాణా శాఖ ప్రత్యేకంగా రోడ్ ఆడిటింగ్ చేస్తోందన్నారు. రోడ్ ఆడిటింగ్ ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడం జరుగుతుందన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల గల కారణాలను అనే్వషించి నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జాతీయ రహదారుల్లో రోడ్ ఆడిటింగ్ పూర్తయిందన్నారు. రాష్ట్ర రోడ్లలో ఆడిటింగ్ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు రూ.100కోట్లు కేటాయించారన్నారు. గతంలో పెద్ద వాహనాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవన్నారు. ఇటీవలి కాలంలో గణాంకాలను పరిశీలిస్తే ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 7 నుండి 8 వేల వరకు రోడ్డు ప్రమాదాలు సంభవించినట్టు తెలిపారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఫలితంగా వారి కుటుంబాలు ప్రమాదాల అనంతరం ఆగమ్యగోచర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. కేవలం నియంత్రణ ద్వారానే ప్రమాదాలను నివారించలేమన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే ప్రమాదాలను నివారించగలమన్నారు. ఆ దిశగా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుండి 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌లో కూడా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ విషయంలో రవాణా శాఖలో జరుగుతున్న అవినీతిని కూడా అరికట్టేందుకు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అండగా ఉన్నామనే ధైర్యం కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రత క్రమశిక్షణ ముఖ్యమన్నారు. సీటు బెల్టు, హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి విధి కావాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నామన్నారు. ప్రతి వారంలో రెండు రోజులు నో యాక్సిడెంట్ డే నిర్వహిస్తున్నామన్నారు. గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేసిన గుడివాడ రూరల్, నాగాయలంక, రెడ్డిగూడెం, గూడూరు, కైకలూరు ఎస్‌ఐలకు మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు తామంతా కృషి చేస్తామంటూ జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుదీక్ష స్వచ్చంద సంస్థ ప్రతినిథి పౌండర్ విమల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిథి డా. బి ధన్వంతరి ఆచార్య, డా. కేశవ కృష్ణ, డా. ప్రభాకర్, డా. పూర్ణ, డా. సుబ్రహ్మణ్యం, నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, ఆర్టీసీ డీఎం సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.