కృష్ణ

జిల్లాలో 34.6మి.మీల సగటు వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను జిల్లాలో 34.6మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30ని.ల నుండి బుధవారం ఉదయం 8.30ని.ల మధ్య ఈ వర్షపాతం నమోదైనట్లు సీపీఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 103.4మి.మీలు నమోదు కాగా అత్యల్పంగా కంచికచర్ల మండలంలో 6.0మి.మీలు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయిలో 85.8, విస్సన్నపేటలో 66.4, మొవ్వలో 61.0, అవనిగడ్డలో 52.6, చల్లపల్లిలో 52.2, మచిలీపట్నంలో 51.2, కోడూరులో 48.4, గుడివాడలో 48.2, కైకలూరులో 46.8, నాగాయలంకలో 45.2, కలిదిండిలో 44.6, ముదినేపల్లిలో 43.2, పమిడిముక్కలలో 43.2, గూడూరులో 43.0, పెడనలో 40.2, కృత్తివెన్నులో 40.0, మండవల్లిలో 39.4, ఉయ్యూరులో 39.2, పామర్రులో 38.8, మోపిదేవిలో 38.4, గుడ్లవల్లేరులో 38.2, నందివాడలో 37.0, పెనమలూరులో 36.4, పెదపారుపూడిలో 36.2, ఘంటసాలలో 34.6, తోట్లవల్లూరులో 34.4, నూజివీడులో 30.6, ఆగిరిపల్లిలో 30.4, బాపులపాడులో 28.4, ముసునూరులో 26.4, పెనుగంచిప్రోలులో 26.2, రెడ్డిగూడెంలో 24.8, కంకిపాడులో 23.4, గన్నవరంలో 21.4, వత్సవాయిలో 20.0, ఉంగుటూరులో 18.6, వీరుళ్లపాడులో 18.4, జి.కొండూరులో 16.4, మైలవరంలో 14.8, గంపలగూడెంలో 14.6, చందర్లపాడులో 14.2, జగ్గయ్యపేటలో 13.6, నందిగామలో 12.4, ఇబ్రహీంపట్నంలో 12.2, విజయవాడ రూరల్‌లో 10.4, విజయవాడ అర్బన్‌లో 10.4, ఎ.కొండూరులో 10.2మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.

జాతీయ రహదారిపై 10 అడుగుల కొండ చిలువ
కృత్తివెన్ను, అక్టోబర్ 23: జాతీయ రహదారిపై 10 అడుగుల కొండ చిలువ అందరినీ ఆశ్చర్యపర్చింది. కృత్తివెన్ను మండలం మాట్లం తూముల వద్ద 216 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 10 అడుగుల కొండ చిలువ కనిపించింది. ఆ సమయంలో అటువెళుతున్న ఓ ద్విచక్ర వాహనం చూసుకోకుండా ఆ కొండ చిలువ తల మీద నుండి వెళ్లిపోవటంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రాంతంలో అనేక విష సర్పాలు ఉంటాయని స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కొండ చిలువ తారస పడలేదంటున్నారు. ఉప్పుటేరులో వరద నీటి ప్రవాహంలో ఈ కొండ చిలువ ఇటువైపుకు కొట్టుకు వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.