కృష్ణ

పెదపట్నం రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : బందరు మండలం పెదపట్నం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) హామీ ఇచ్చారు. బుధవారం ఆయన తన నివాసానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పెదపట్నం గ్రామ మాజీ సర్పంచ్ ఇంతేటి మరియన్న నేతృత్వంలో 20 మంది రైతులు మంత్రి పేర్నిని కలిసి తమ సమస్యలను వివరించారు. 30 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు శిస్తు చెల్లిస్తున్నా తమ పేర్లు అడంగల్‌లో చూపడం లేదన్నారు. ఫలితంగా ప్రభుత్వం అందించే రైతు భరోసా పథకానికి తాము అర్హత పొందలేకపోతున్నామని మంత్రి పేర్నికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోతేపల్లి గ్రామానికి చెందిన బండి వెంకయ్య నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ మణిపాల్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోగా అందుకు అయిన రూ.10లక్షలు మొత్తాన్ని సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేయాలని అతని బంధువులు మంత్రిని కోరారు. పెదపట్నం గ్రామానికి చెందిన దండే సుప్రియ తన కుమారుడైన ప్రసన్న కుమార్ గోకవరం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందాడని, వాహన యజమాని వద్ద నుండి నష్టపరిహారం ఇప్పించాలని మంత్రిని కోరగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.