కృష్ణ

కలత చెందుతున్న ‘పసి’ మనస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : తల్లిదండ్రులు మందలించారని ఒకరు.. చదవంటే భయంతో మరొకరు.. వసతి గృహంలో అధికారుల సంరక్షణ సరిగ్గా లేక మరికొందరు.. ఇలా ఇటీవల కాలంలో విద్యార్థుల తమ ఇళ్ల నుండి, స్కూళ్ల నుండి, వసతి గృహాల నుండి పారిపోయిన సంఘటనలు అనేకం.. అయితే సోషల్ మీడియా ప్రభావంతో కొత్త ప్రదేశాలు చూసొద్దామని కొందరు.. ప్రేమ పేరుతో గడప దాటుతున్న వారు మరెందరో. చిన్నచిన్న కారణాలతో కన్న తల్లిదండ్రులను వదిలి వెళ్లిపోతూ వారి కడుపు కోతకు కారణమవుతున్నాయి నేటి బాలల మానసిక పరిస్థితులు. మానసిక వికాసం లేకపోవటంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పోలీసులు కూడా బాల్యంలో పిల్లల పట్ల తగినంత ఆదరణ చూపకపోవడం వల్లే ఇంటి నుండి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. పిల్లల్లో మానసిక పరివర్తన లోపించడం, అనాలోచితమైన ఆలోచనలు, కుటుంబ పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావం బాల్యం మీద పడుతోందనడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి. మనం పెరిగే ప్రదేశం, చుట్టూ ఉన్న వాతావరణం, తోటి వారి ఆలోచనా విధానం పిల్లలపై పడి ఏం చేయాల్లో ఆలోచించలేని వయస్సులోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్నతనం నుండి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పర్యవేక్షణ, మొదలైనవన్నీ పిల్లల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతున్నారు. అర్థం లేని ఆవేశంతో, ఆలోచన రహితపూరిత నిర్ణయాలతో ఇంటి నుండి వెళ్లిపోయి తల్లిదండ్రుల వేదనకు కారణమవుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా చూస్తే జిల్లాలో నమోదైన బాలల మిస్సింగ్ కేసులు ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో 160 బాలల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు మాత్రం బాలల మిస్సింగ్ కేసుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధే కనబరుస్తున్నారు. 160 కేసుల్లో 145 కేసులను ఛేదించి ఇళ్ల నుండి వెళ్లిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల దరికి చేర్చారు. మిస్సింగ్ కేసుల కోసం జిల్లాలో ప్రత్యేకంగా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి కేసులను ఛేదిస్తున్నాయి. కేసులను ఛేదించడంలో సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు ఎంతగానో ఉపయుక్తంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ఇట్టే మిస్సింగ్ అయిన బాలల ఆచూకీ పట్టేస్తున్నారు. కానీ కొన్ని కేసులు మాత్రం మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.
పిల్లల అభిరుచులను తెలుసుకోవాలి
కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన మన పిల్లలు సరైన సక్రమ మార్గంలో పయనిస్తున్నారా..? లేదా..? వారి మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది..? వారు మన నుండి ఏం కోరుకుంటున్నారు..? ఇలాంటి చిన్న చిన్న విషయాలను తల్లిదండ్రులుగా మనం గమనిస్తే పిల్లలు గడప దాటే పరిస్థితులు ఉండవంటున్నారు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు. పిల్లల ఆలనాపాలనా చూసుకోవల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదనేనని చెబుతున్నారు. తమ పిల్లలను పిల్లలుగా కాకుండా స్నేహితులుగా చూసిన నాడు కుటుంబ వ్యవస్థ మరింత బలపడటంతో పాటు బాలల మిస్సింగ్ కేసులు కూడా తగ్గుముఖం పడతాయని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొంటున్నారు.