కృష్ణ

‘క్షిపణి’ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక : మండల పరిధిలోని గుల్లలమోద ప్రాంతంలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో డీఆర్‌డీఓ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న రక్షణ పరిశోధన కేంద్రం వల్ల కలుగు అనర్ధాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని జిల్లా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం పురవీధులలో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా జిల్లా రైతు కూలీ సంఘం కోశాధికారి తలసిల లీలా మనోహర్ మాట్లాడుతూ హిరోషిమా, నాగసాకి తరహాలో భారీ విధ్వంసాన్ని సృష్టించే క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. క్షిపణి ప్రయోగ కేంద్రం వల్ల వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుందని, తద్వారా ప్రజలకు, పశుపక్షాదులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని తలసిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్షిపణి కేంద్రం ఏర్పాటు వల్ల జిల్లాలో, దివిసీమలో పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనాలను ప్రజలకు ముందుగా బహిరంగం చేయలేదన్నారు. ప్రజల జీవన విధానంపై దీని ప్రభావాన్ని అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటును వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

కుంగిపోయిన వ్యవసాయ భూమి
పామర్రు, ఆగస్టు 24: స్థానిక శ్యామలాపురం సమీపంలో 591 సర్వే నెంబరులో సుమారు 16 ఎకరాల మాగాణి భూమి ఉండగా అందులో సుమారు నాలుగు ఎకరాలు వరి నాట్లు పూర్తి చేసిన పంట భూమి గత రెండు రోజులుగా కుంగుతూ శనివారం నాటికి అడుగున్నర లోతుకు పూర్తిగా కుంగిపోయింది. పొలం యజమానులు షహీద్‌షా సాహెబ్ హుస్సేనీ, ఖుద్దీస్, రీయాజుద్దిన్‌లు శనివారం పంట భూమిని విలేఖర్లకు చూపి గత రెండు రోజులుగా భూమి కుంగినట్లు తెలిపారు. చుట్టు పక్కల పంట భూమిలోని నీరు ఈ కుంగిపోయిన భూమిలోకి చేరడంతో వరి నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కౌలుదారులు పంట భూమిని వదిలి వేసి వెళ్లిపోయినట్లు యజమానులు వివరించారు. ఇది ఇలా ఉండగా చుట్టు పక్కల రైతులు తమ పంట భూముల్లోని నీరు అంతా కుంగిన పల్లం భూమిలోకి వెళ్లిపోవటంతో తమ పొలాలకు నీరు లేకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పొరల్లో నీటి సాంద్రతలో తేడాలు రావటం వల్ల అరుదగా భూములు కుంగుతుంటాయని పలువురు రైతులు తెలిపారు. గత వేసవిలో విపరీతమైన ఎండలకు ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో నీటి శాతం తగ్గిపోయి ఉండవచ్చునని, ఫలితంగా ఇప్పుడుతున్న వర్షాలకు భూమి కుంగి ఉండవచ్చునని రైతులు వివరించారు. చుట్టుపక్కల సుమారు 60 ఎకరాలు ఉండగా ఈ నాలుగు ఎకరాలు మాత్రమే కుంగటాన్ని రైతులు వింతగా చూస్తున్నారు. కుంగిపోయిన భూమి యజమానులు ఈ మేరకు పామర్రు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.