కృష్ణ

కృష్ణమ్మా.. శాంతించమ్మా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక : ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించమ్మా.. అంటూ మహిళలు శనివారం నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద వందలాది మంది మహిళలు కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించారు. గత నాలుగు రోజులుగా కృష్ణానదికి వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల నుండి భారీగా వస్తున్న వరద తాకిడికి దివిసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ మహిళలు కృష్ణమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కష్టాల్లో ఉన్న ప్రజలను
ఆదుకోడమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రులు పేర్ని, కొడాలి, అనిల్‌కుమార్
తోట్లవల్లూరు, ఆగస్టు 17: కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోడమే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి మంత్రులు మండలంలోని వరద ముంపునకు గురైన నదీ పరీవాహక ప్రాంతాలను శనివారం పరిశీలించారు. వల్లూరుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కాళింగదిబ్బలంక, తోడేళ్ళదిబ్బలంక ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిలో 200 మంది ఉండగా వారితో మాట్లాడుతూ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సమయానికి అన్నీ పెడుతున్నారా అని ప్రశ్నించగా సక్రమంగా చూస్తున్నారని సమాధానం ఇచ్చారు. ఇంకా వరద ఐదు రోజులపాటు కొనసాగుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. అనంతరం తోట్లవల్లూరు కృష్ణానది రేవు వద్దకు వచ్చి వరద ఉద్ధృతి పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులు మంత్రులతో మాట్లాడారు. వరద తాకిడికి లంకల్లోని పంటలన్నీ మునిగిపోయాయని తెలిపారు. ఎక్కువ శాతం సాగు చేసింది కౌలు రైతులేనని చెప్పారు. ఎక్కువ శాతం పసుపు, కంద, అరటి పంటలు వేశామని చెప్పారు. ఒక్కొక్క రైతు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారని, మళ్ళీ అదనంగా కౌలు చెల్లించామని తెలిపారు. మంత్రి నాని మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారని తెలిపారు. మీ బాధలు మాకు అర్థమయ్యాయని, ఈ విషయాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి రైతులను అన్ని విధాలగా ఆదుకుంటామని తెలిపారు. మంత్రులతో పాటు స్థానిక నాయకులు మాజీ ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, మండల వైసిపి కన్వీనర్ జొన్నల రామ్మోహన్‌రెడ్డి, వైసిపి జిల్లా కార్యవర్గ సభ్యుడు చింతలపూడి గవాస్కర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.