కృష్ణ

లంక గ్రామాల్లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ఎగువ రాష్ట్రాల నుండి వస్తున్న వరద నీరు కారణంగా జిల్లా అధికార యంత్రాం గం అప్రమత్తమైంది. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో మంగళవారం 70 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతల నుండి 5లక్షల క్యూసెక్కుల మేర నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ఒకటి రెండు రోజుల్లో 6లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. దీంతో బ్యారేజీ వద్ద 70 గేట్ల ద్వారా 25వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి వరద ఉధృతిపై అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 ప్రభావిత మండలాలుగా గుర్తించారు. ఇందులో అత్యధికంగా లంక గ్రామాలు ఉన్నాయి. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు గాను ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని కలెక్టర్ నియమించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులంతా మంగళవారం లంక గ్రామాల్లోనే తిష్ట వేశారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ లంక గ్రామాల్లో ముందస్తు పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు. జగ్గయ్యపేట మొదలుకుని నాగాయలంక వరకూ నదీ పరివాహక గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉధృతిని బట్టి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ప్రజలకు సూచించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు కరకట్టల పటిష్ఠతపై దృష్టి సారించారు. బలహీనంగా ఉన్న కరకట్టలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.