కృష్ణ

రిటైర్డు ఆర్టీసీ కార్మికులకు రేషన్‌కార్డులు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు, సామాజిక పెన్షన్‌లు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు, నివేశన స్థలాలు ఇప్పించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ను కోరారు. మంగళవారం మంత్రి కార్యాలయం వద్దకు పలు సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలు మంత్రికి విన్నవించి పరిష్కరించాలని కోరారు. వచ్చిన అర్జీదారుల సమస్యలు మంత్రి ఆలకించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌సన్ తదితరులు మంత్రిని కలిసి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.310 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని, ప్రస్తుత జీవన ప్రమాణాలు మేరకు రూ.10వేలు ఇప్పించాలని, తమ ఇతర సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. వారి సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి అర్హులకు పెన్షన్‌లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు త్వరలో మంజూరు చేస్తామన్నారు. మండల పరిధిలోని తుమ్మలపాలెం గ్రామానికి చెందిన బట్లంకి మణికంఠ కామెర్ల వ్యాధితో వైద్య చికిత్స తీసుకున్నట్లు, స్థానిక సుకర్లాబాదుకు చెందిన గంటా భద్రమ్మ గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నట్లు అందుకు అయిన వ్యయం మెడికల్ బిల్లులు రీయంబర్స్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేయించాలని ఆర్జీ దారులు మంత్రిని కోరారు. 2018 డీఎస్‌సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇచ్చే ముందుగానే ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చినప్పుడు బదిలీలు చేపట్టాలని వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు రీయాజ్ హుసెన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.