కృష్ణ

ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజా సమస్యల పరిష్కారానికే తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన డా. కృత్తిక శుక్లా అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఇఓగా పని చేస్తున్న ఆమెను జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఇటీవల ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్‌గా జిల్లా వాసులకు సమర్ధవంతమైన సేవలు అందిస్తానన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలతో పాటు భూములకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కృషి చేస్తానన్నారు. 2013 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన కృత్తిక శుక్లా జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారు. 2015 డిసెంబర్ 12వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్‌గా తొలి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 2016 నవంబర్ 14వ తేదీ వరకు మదనపల్లి సబ్ కలెక్టర్‌గా సేవలు అందించారు. అనంతరం నవంబర్ 18వ తేదీన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది 2018 ఫిబ్రవరి 2వతేదీ వరకు పని చేశారు. అనంతరం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఇఓగా సేవలు అందిస్తూ జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.