కృష్ణ

ఇళ్ల స్థలాల సమస్యపై గ్రామస్తుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ఇళ్ళ స్థలాల సమస్యపై సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద రెండు గ్రామాల ప్రజలు ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. తోట్లవల్లూరు, పాములలంక ప్రజలు టెంట్‌లు వేసి పోటా పోటీగా ధర్నా నిర్వహించారు. పాములలంక మాజీ సర్పంచ్ పాముల శ్రీనివాసరావు, పిఎసిఎస్ డైరెక్టర్ మోటూరి చెంచయ్య, జన్మభూమి కమిటీ సభ్యుడు పాముల ప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు మహిళలతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇళ్ళ పట్టాలు మంజూరు చేసి పంపిణీ చేయకుండా ఎందుకు నిలిపివేశారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు, ప్రకాష్ మాట్లాడుతూ 2012లో అప్పటి ఎమ్మెల్యే డివై దాస్ తోట్లవల్లూరులో కనకదుర్గమ్మ కాలనీ వద్ద 303 సర్వేనెంబర్‌లో 4.8ఎకరాలను పాములలంక ప్రజలకు ఇళ్ళ స్థలాల కోసం సేకరించారని చెప్పారు. వరదల సంభవిస్తుండటంతో లంక గ్రామస్తులమైన తమకు తోట్లవల్లూరులో ఇళ్ళ స్థలాలు ఇస్తామని 127 మందికి పట్టాలు మంజూరు చేసి వాటిని హౌసింగ్ అధికారులకు అప్పగించారన్నారు. అప్పటి నుంచి పట్టాలు అడుగుతుంటే అదిగో ఇదిగో అంటు కాలం గడుపుతు వచ్చారని, జన్మభూమి గ్రామసభల్లో అడుగుతుంటే 127 మందికి కనకదుర్గమ్మ కాలనీ వద్ద ఇస్తామని, మిగిలిన వారికి తోట్లవల్లూరు బంగాళతోట భూముల్లో ఇస్తామని చెపుతు వచ్చారని శ్రీనివాసరావు అన్నారు. అయితే తాజగా 154 మందికి పట్టాలను సిద్దం చేశామని విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు అందిస్తామని ఆదివారం రెండు బస్సుల్లో తీసుకెళ్ళి నిరాశపర్చారని అన్నారు. విజయవాడలో ఆందోళనకు దిగితే 20 మందికి ఇచ్చి సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద అందిస్తామని అధికారులు చెప్పారన్నారు. ఇపుడు మిగిలిన వారికి పట్టాలు అడుగుతుంటే తర్వాత ఇస్తామని, ఇపుడు కుదరదని చెప్పటంతో ధర్నాకు దిగామని శ్రీనివాసరావు తెలిపారు. పాములలంక ప్రజలకు తోట్లవల్లూరులో ఇళ్ళ స్థలాలు ఇవ్వద్దని కొందరు నాయకులు చెప్పటంతో అధికారులు పట్టాల పంపిణీని నిలిపివేశారని పాముల ప్రకాష్ ఆరోపించారు. మా కోసం సేకరించిన భూముల్లో మాకే పట్టాలివ్వాలని, సిద్దం చేసిన పట్టాలను 154 మందికి అందించాలని అప్పటి వరకు ధర్నా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దింతో డిప్యూటి తహశీల్దార్ సాయిమహేష్, ఆర్‌ఐ ప్రసాద్, ఎస్‌ఐ మురళీ చర్చలు జరిపారు. కొత్త తహశీల్దార్ వచ్చాక పట్టాలు ఇస్తామని సాయిమహేష్ చెప్పగా మంజూరైన పట్టాలను అన్ని గ్రామాల్లో ఇచ్చి తమకే ఎందుకు నిలిపివేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధికారులు వచ్చి మంగళవారం అందిస్తామని హామి ఇచ్చారు. దాంతో ధర్నా విరమించారు. అలాగే తోట్లవల్లూరుకు చెందిన వల్లూరు రాంబాబు, ఉయ్యూరు చిట్టిబాబు తదితరులు ఆధ్వర్యంలో మహిళలు ధర్నాకు దిగి తోట్లవల్లూరు ప్రజలకు ఒక్కరికి కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా వేరే పంచాయతీకి చెందిన పాములలంక ప్రజలకు ఇక్కడ ఎలా స్థలాలు ఇస్తారని అన్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి జన్మభూముల్లో అర్జీలు ఇస్తున్నామని, 400 మంది ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తుంటే మమ్ములను విస్మరించటం దారుణమని అనసూయ, గొరిపర్తి నాగేశ్వరమ్మ, జాకీర్ హుస్సేన్ బేగ్, నేతాజి తదితరులు అన్నారు. కొత్త తహశీల్దార్ వచ్చాక బంగాళతోట భూముల్లో ఇళ్ళ స్థలాలను తోట్లవల్లూరు ప్రజలకు ఆస్తామని డిప్యూటి తహశీల్దార్ సాయిమహేష్ చెప్పారు. దాంతో తోట్లవల్లూరు ప్రజలు ధర్నా విరమించారు.