కృష్ణ

గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు ఎలా ంటి ఇబ్బందులు కలుగకుండా వౌ లిక వసతులు కల్పించాలని ఎంపీపీ కొసరాజు విజయ భారతి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు ఆయా శాఖల పని తీరుపై వివరించారు. అనంతరం ఎంపీపీ విజయభారతి గ్రామాల్లో మంచినీరు, రోడ్లు తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శాయన పుష్పవతి, పీఆర్ ఎఇ నాగేశ్వరరావు, మండల వ్యవసాయశాఖ అధికారిణి ఎన్ రమాదేవి, ఎంపీడీఓ ఎవి రమణ, సూపరింటెండెంటు మధుసూధనరావు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గుంటూరు జెసీ-2గా ఎస్సీ కార్పొరేషన్ ఇడీ బదిలీ

మచిలీపట్నం, ఫిబ్రవరి 11: ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌వివి సత్యనారాయణకు గుం టూరు జాయింట్ కలెక్టర్-2గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ ఇడీగా సత్యనారాయణ విశేష సేవలు అందించారు. కార్పొరేషన్ రుణాల మంజూరులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి ఉ న్నతాధికారుల మన్ననలు పొందారు. అ లాగే పరిపాలనా విధానంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రతిష్ఠాత్మకంగా ఐఎస్ ఓ సర్ట్ఫికేట్ సాధనలో కూడా సత్యనారాయణ కీలక భూమిక పోషించారు. అ ర్హులైన ప్రతి ఒక్క ఎస్సీ లబ్ధిదారునికి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చి ఆయా వర్గాల అభిమానాన్ని చూరగొన్నారు. గుంటూరు జెసీ-2గా బదిలీపై వెళుతున్న ఆయనకు పలు దళిత సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఇడీగా మురళీ నియమితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న మురళీని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడీగా ప్రభుత్వం బదిలీ చేసింది.

డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు బదిలీ

మచిలీపట్నం, ఫిబ్రవరి 11: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డి చంద్రశేఖరరాజు బదిలీ అ య్యారు. తన మాతృ శాఖ అయిన బీసీ సం క్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు సంవత్సరాలుగా డీఆర్‌డీఎ పీడీగా చంద్రశేఖరరాజు విశేష సేవలు అందించారు. డ్వాక్రా గ్రూపు సభ్యులకు బ్యా ంక్ లింకేజీ రుణాల మంజూరులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపి పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా లిం కేజీ రుణాల మంజూరులో జిల్లా ప్రథమ సా థనంలో నిలుస్తూ వచ్చింది. చంద్రశేఖరాజు స్థానంలో తెనాలి ఆర్డీవోగా పని చే స్తున్న ఎం శ్రీనివాసరావు నియమితులయ్యారు.

సంఘీభావ దీక్షలో మంత్రి కొల్లు సతీమణి
మచిలీపట్నం (కోనేరుసెంటరు) ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వ ని ర్లక్ష్య వైఖరికి నిరసనగా ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయుడు సో మవారం ఢిల్లీలో చేపట్టిన ధర్మ పో రాట దీక్షకు మద్దతుగా స్థానిక కోనేరు సెంటరులో నిర్వహించిన సంఘీభావ దీక్షలో రాష్ట్ర మంత్రి కొల్లు ర వీంద్ర సతీమణి, స్పర్శ రిహాబిలిటేషన్ సెంటర్ చైర్‌పర్సన్ నీలిమ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, ఎస్సీ సె ల్ అధ్యక్షుడు చిట్టూరి యువరాజు, సాతులూరి నాంచారయ్య, పైడిపాముల గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.