సబ్ ఫీచర్

పిల్లల గది ఎలా ఉండాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో సంపన్నుల ఇళ్లలోనే కాదు, మధ్య తరగతి కుటుంబాల్లోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తున్నారు. చిన్నారులకు ఆనందం కలిగించేలా వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆ గదిని తీర్చిదిద్దాలి. వారికి కావలసిన అన్ని సౌకర్యాలను అక్కడ సమకూర్చాలి. పిల్లలు సరదాగా గడిపేందుకు, ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించేందుకు ఆ గదిలో తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. పిల్లల వయస్సును, వారి ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆ గదిని తీర్చిదిద్దాలి. వారి గదిలో సాధారణ బల్బు కాకుండా ట్యూబ్‌లైట్‌ను అమర్చాలి. గాలి, వెలుతురు గదిలోకి ప్రవేశించేలా ఉండాలి. కిటికీలకు, తలుపులకు తెరలు వేస్తే అవి పలుచగానూ లేత రంగులతోనూ ఉండాలి. ఆ గది కిటికీలకు జాలీ లేదా ఇనుప చువ్వలను బిగించాలి. పిల్లలకు అందుబాటులో వుండేలాగా అల్మరా తలుపులను ఏర్పాటుచేయాలి. అల్మరాల కింది భాగాన డ్రాయర్లు ఉండేలా ఏర్పాటుచేయాలి. గోడలకు ముదురు రంగులను ఉపయోగించకూడదు. పిల్లలకు ఇష్టమయిన, అందమైన ఛార్ట్‌లను వేయాలి. పిల్లల మంచాలు ఎత్తు తక్కువగా ఉండేలా చూడాలి. వారికి అనువైన విధంగా కుర్చీలు, టేబులు ఉండాలి. అవి పిల్లలు చదువుకునేందుకు, రాసుకునేందుకు అనువుగా వుండాలి.
పిల్లలు బొమ్మలను, ఇతర వస్తువులను భద్రపరచుకోవటానికి ఒకటి, రెండు అరలు ఉండటం అవసరం. ఇన్‌డోర్ గేమ్స్‌ను కూడా అక్కడే పిల్లలకు అలవాటు చేయాలి. బయట ఆడుకునేందుకు తీసుకువెళ్లే క్రీడా సామగ్రిని కూడా వారు తమ గదిలోనే ఉంచుకోవాలి. పుస్తకాలను సర్దుకోవటానికి ఒక బుక్ రాక్‌ను పిల్లల గదిలో ఉంచితే బాగుంటుంది. గదిలో ఓ మూల డస్ట్‌బిన్‌ను ఉంచితే, చెత్తా చెదారం, కాగితం ముక్కలు, పండ్ల తొక్కలు, గింజలు లాంటివి అందులో పడేస్తారు.
పిల్లల గదిలో అమర్చే గోడ గడియారం ప్రత్యేకంగా ఉండాలి. సీలింగ్‌కు అమర్చే ఫ్యాన్ బొమ్మలతో ఉండేలా ఎంపిక చేయాలి. పిల్లల గదిలో గోడకు దేశ నాయకుల ఫొటోలను, వారి చదువుకు సంబంధించిన వాల్ హ్యాంగింగ్స్‌ను అమర్చాలి. పిల్లలకు వచ్చిన బహుమతులను, ట్రోఫీలను, ఫీల్డ్‌లను అద్దాలున్న అలమరలో సర్దాలి. నేలమీద చక్కని డిజైన్‌తో వున్న తివాచీని పరచవచ్చు. పిల్లల పరుపుమీద పరిచే దుప్పటి, తలగడ, గలీబు వారికి నచ్చిన రంగులతో, వారు మెచ్చే బొమ్మలతో ఉండేటట్లుగా చూడాలి. పిల్లలు తమ గదిని పరిశుభ్రంగా ఉంచుకునేలాగా, పుస్తకాలను, బట్టలను పొందికగా సర్దుకునేలా తల్లిదండ్రులు వారికి తగిన శిక్షణనిస్తూ, శుభ్రత అలవడేలా నేర్పించాలి. తమ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వారు తమ గదిలోకే తీసుకెళ్తారు. పిల్లలు ఇల్లంతా తిరుగుతూ, గెంతులు వేస్తూ అల్లరి చేయరు. ఆ గదిలోనే చదువుకుంటారు, హాయిగా ఇన్‌డోర్ గేమ్స్ ఆడుకుంటారు.

-నిర్మల