రాష్ట్రీయం

టీచర్లా? కీచకులా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటలో వరుస ఘటనలతో కలకలం

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే గతి తప్పుతున్నారు. గౌరవనీయ వృత్తిలో ఉండి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. నైతిక విలువలతో భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సినవారు ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. నల్గొండ జిల్లా సూరాపేటలో ఒకేరోజు జరిగిన రెండు సంఘటనలు తీవ్ర కలకలం రేపాయ. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పదో తరగతి బాలికతో లాడ్జిలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయ కటకటాలు పాలుకాగా... ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధించినందుకు మరో అధ్యాపకుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు.

టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం

లాడ్జిలో పట్టుబడిన ఉపాధ్యాయుడు * అరెస్టు చేసిన పోలీసులు

సూర్యాపేట, నవంబర్ 26: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రేమ పేరుతో విద్యార్థినిని లోబర్చుకొని ఆమెపై అత్యాచారం చేసిన కీచక టీచర్ ఉదంతం నల్గొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం అర్థరాత్రి వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నెల్లూరి నాగేశ్వర్‌రావు అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినికి మాయమాటలు చెప్పి గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థినితో బుధవారం రాత్రి సూర్యాపేట పట్టణానికి చేరుకొని కొత్తబస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గది తీసుకొని ఆమెపై అత్యాచారం జరిపాడు. గత రెండురోజులుగా తమ కుమార్తె కనిపించకపోవడంతో వెతుకుతున్న బాలిక తల్లిదండ్రులు తమకు అందిన సమాచారం మేరకు సూర్యాపేటకు చేరుకొని లాడ్జిలో గాలించగా వారిద్దరు నేరుగా పట్టుబడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ పోలీసులు నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేశారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి అపహరించి అత్యాచారం చేశాడంటూ విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు నాగేశ్వర్‌రావుపై అత్యాచారం, కిడ్నాప్ కేసులను నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ వై.మొగిలయ్య తెలిపారు.

ఇంటర్ విద్యార్థినిపై
లైంగిక వేధింపులు
అధ్యాపకుని సస్పెన్షన్
సూర్యాపేట, నవంబర్ 26: నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థినిపై ఒక అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఈసి మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిని కళాశాలలో కామర్స్ అధ్యాపకునిగా పనిచేస్తున్న లింగరాజు అనే వ్యక్తి గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పగా వారు చదువుమానివేయాలని చెప్పడంతో కొన్ని రోజులు కళాశాలకు వెళ్లలేదు. అయతే, చదువుకోవాలన్న తపనతో మళ్లీ కళాశాలకు వస్తున్న ఆ విద్యార్థినిని అదే అధ్యాపకుడు మళ్లీ వేధించడం ప్రారంభించాడు. గురువారం కళాశాలకు వచ్చిన ఆ విద్యార్థినిని అధ్యాపకుడు లింగరాజు తన కోరిక తీర్చమంటూ వేధించడంతో భరించలేక సదరు విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ అవిలయ్యకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధ్యాపకుడు లింగరాజును విధుల నుంచి తొలగించినట్లు ఆర్‌ఐవో ప్రకాష్‌బాబు తెలిపారు.
===================

కోడలిపై కిరోసిన్ పోసి...నిప్పంటించిన అత్త
* ప్రాణాపాయ స్థితిలో కోడలు

సిద్దిపేట, నవంబర్ 26: కట్నం కోసం కోడలుపై అత్త కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేట ప్రశాంత్‌నగర్ వడ్డెర కాలనీలో గురువారం వెలుగుచూసింది. సిద్దిపేట వన్‌టౌన్ సిఐ సురేందర్‌రెడ్డి, బాధితురాలు బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సిద్దిపేట ప్రశాంత్‌నగర్‌కు చెందిన కుంచం స్వరూప (19)కు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన స్వరూపకు ఈ యేడాది ఫిబ్రవరి 22న వివాహం జరిగింది. 80 వేల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు ఇచ్చి వివాహం జరిపించారు. నెలరోజుల పాటు కాపురం సజావుగా సాగింది. ఆనంతరం అదనంగా కట్నం తేవాలని భర్త సంపత్, అత్త యాదవ్వ, మామ ఎల్లయ్య, మరిది శేఖర్ స్వరూపను చిత్రహింసలకు గురిచేసేవారు. ప్రస్తుతం స్వరూప ఐదు నెలల గర్భవతి. కుటుంబ కలహాలు తరుచుగా జరిగేవి. బుధవారం రాత్రి సంపత్‌తో గొడవ జరిగింది. గురువారం భర్త సంపత్, మామ ఎల్లయ్య, మరిది శేఖర్ పనికోసం బయటకు వెళ్లిన తర్వాత, అత్త స్వరూపతో గొడవ పడింది. ఇంట్లో పనిచేయవద్దని బయటకు పంపిస్తానని బెదిరించింది. స్వరూప ఇవేమీ పట్టించుకోకుండా కిచెన్‌లో పనిచేస్తున్న క్రమంలో అత్త వెనుక నుంచి స్వరూపపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో స్వరూప కేకలు వేయగా చుట్టుపక్కలవారు చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న క్రమంలో తన అత్త యాదవ్వ కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు స్వరూప తహశీల్దార్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. 90 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సిఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.