కథ

మంగమ్మ శపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శపథం చేసింది, చేసేది ఆడది కదా?! కాదు. ఆ శపథం చేసింది సుబ్బారావు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మగవాడేంటి మంగమ్మ శపథం ఏమిటి? చూద్దాం!
సుబ్బారావుకు పోలీస్ ఉద్యోగం వచ్చింది మొదలు ఎప్పుడెప్పుడు గుంటూరు బండెక్కుదామా అని ఆరాటపడ్తున్నాడు. గుంటూరెందుకో? తనకు ఉద్యోగం విజయవాడలో కదా? ఆయన నచ్చి మెచ్చిన నాయిక చిట్టెమ్మను చూడాలి. తన ఉద్యోగ వివరాలు.. తన పెండ్లి చిట్టెమ్మతో జరగాలంటే ఆమె తండ్రితో మాట్లాడాలి. అందుకు గుంటూరు వెళ్లాలి. ఇలా ఆలోచనా తెమ్మెరలలో తికమకగా వుంది సుబ్బారావు మనసు.
చిట్టెమ్మ రామయ్యగారి 12వ సంతానంలో 5గురు ఆడ సంతానంలో ఆఖరిది. బహు రూపసి. పసిమి ఛాయ. విశాల నేత్రాలు. మంచి వొంటి తీరుతో మెరిసిపోతూ అందర్నీ ఆకర్షించే అందాల గుమ్మ. చిట్టెమ్మ వరుసకు సుబ్బారావు బావ. చిట్టికి పదేళ్లున్నప్పుడే ప్రేమించేశాడు. మనువాడాలనుకున్నాడు. తాను కొంచెం ఛాయ తక్కువ. కానీ పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యాడంటే మంచి ఒడ్డూ పొడుగూ కండబలం వున్న అందగాడే మరి.
చుట్టాలే కాబట్టి డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే సెలవు దొరికితే సరి విజయవాడ నుండి గుంటూరు బ్రాడీపేట ఇంట్లో వాలేవాడు. రామయ్యగారిల్లు విజయవాడ ప్లాట్‌ఫారం అంటే అతిశయోక్తి కాదు! వచ్చే పోయే బంధువులు స్నేహితులు ఒకటే రద్దీ. పూరీలు గంపెడు. హండాడు దుంపల కూర. ఇడ్లీలు వాయిలెన్నో దిగాల్సిందే. ఎప్పుడు రైలు దిగి వస్తారో అంటూ కోడళ్లు వండి వార్చడం దినచర్యగా ఉంటుందా ఇంట్లో. వేడివేడి అన్నం తినాలంటే కోడలు సుశీలమ్మకు ప్రీతి. అందుకే వేళదాటి రైలు దిగి వస్తే ఆహా! ఏమి సంబరం సుశీలమ్మకు. చకచకా పొయ్యి మీదకు ఎసరెక్కించేది.
అలాంటి సందడి ఇంట్లో సుబ్బారావు ప్రేమలో పడ్డది చిట్టెమ్మ. చూపులతో గాలమేసి చిన్నిచిన్ని కానుకలతో మురిపిస్తూ ఎవరూ చూడకుండా ఉగ్రాణపు గదిలోనో ఎక్కడో ఒకచోట మాటేసి వాటేసుకుని వశపరచుకుని ఒకరి మీద ఒకరికి ప్రగాఢ ప్రేమ ఏర్పరచుకున్నారు.
చిట్టెమ్మ ఓ చిన్న పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా గుంటూరు పని చేస్తుండేది. విద్యార్థులకు, తోటి టీచర్లకు అందరికీ ఆమె రూపం, నమ్రత, విద్యా బోధనా విధానం, ఆమె చిరునవ్వులు అంటే అమిత అభిమానం, గౌరవము కూడా. అలా హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ప్రవేశించిన సుబ్బారావు ఓ రోజు పిడుగు లాంటి వార్తను మోసుకొచ్చాడు. ‘మా వాళ్లు నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారండీ. నాకేమో మీ చిట్టెమ్మను చేసుకోవాలని ఆశ ఎప్పటి నుండో అంకురించి వృక్షవౌతున్నది. ఏమంటారు? నాకిచ్చి చేయండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను’ అని రామయ్య భాగ్యమ్మల్తో నేరుగా అడిగేశాడు.
రామయ్య తారాజువ్వలా లేచాడు. ‘ఏవిటీ ఈ కాస్త పోలీస్ ఉద్యోగం వెలగబెట్టే నీకు నా చిట్టినివ్వాలా? దాని అందానికి చదువుకి ఏ కలెక్టర్‌కో, డాక్టర్‌కో ఇచ్చి చేయాలని నా ఆశ. అయినా దాని పెండ్లి పై వాళ్లకు కానిదే ఎందుకు తొందర? ఇలా పోలీసోడికి నేను మా చిట్టిని ఇవ్వను గాక ఇవ్వను. అనుకోవాలే కానీ ఎంత మందయినా వరసకట్టి దాన్ని చేసుకోడానికి ఎగబడతారు. ఇప్పుడే చెబుతున్నా సుబ్బారావ్! ఇకపై అలాంటి ఆశలు మానుకో. మా ఇంటికి రావడం కూడా తగ్గించు. అసలు రాకు’ అంటూ గట్టిగా తన నిర్ణయాన్ని రామయ్య చెప్పేశాడు.
ఇక చిట్టెమ్మ పితృ పరాధీన. కన్నీళ్లతో లోలోపల దుఃఖపడుతూ ఆహారము తినక, నిద్రలేమితో తన ప్రేమ ఇలా విఫలవౌతున్నదని అక్కలకూ అన్నయ్యలకూ చెప్పుకోలేక దిగమింగుకుంటూ పడుచుపిల్ల వ్యధ ననుభవిస్తూ ఉండిపోయింది. కాలం ఆగదుగా. నడుస్తున్నది.
తరువాత రెండు మూడు మార్లు చిట్టితో తమ పెండ్లి ప్రస్తావన తేవడం రామయ్య చిరాకుతో సమాధానమివ్వడంతో తన ఇంట్లో కూడా అమ్మా నాన్నల బలవంతం ఎక్కువవడంతో పసిడి మేని ఛాయతో అందాల, సువర్ణ, కట్న కానుకలతో వధువుగా తన ఇంట ప్రవేశించటము.. చక్కగా సుబ్బా రావు కాపురం చేసుకుంటు న్నాడు కానీ ఎక్కడో వెలితి. చిట్టి నా జీవితంలోకి రాలేదే అన్న నిరాశా నిస్పృహ ఛాయలు వెన్నాడుతున్నాయి. కాలం నడుస్తోంది. నాది కదా, నాది కాలేదా చిట్టెమ్మ చూద్దాం అనుకునేవాడు.
చిట్టి తన మనస్సుకు నచ్చ జెప్పుకోవడానికి ప్రైవేటుగా బి.ఏ. పరీక్షపై కేంద్రీకరించి ఉత్తీర్ణురాలైంది. ఒక అక్కయ్య శారదమ్మ భర్త రాజారావుగారు తహసీల్దార్. ఆయన సలహా మేరకు బి.ఇడి కూడా ప్రైవేటుగానే పాసయింది. వెంటనే అక్కడి ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరింది. అయినా తాను జీవితంలో పోగొట్టుకున్న ప్రేమ, సుబ్బారావు మంచితనం, ఆయన చిలిపి కబుర్లూ గుర్తొచ్చి ఆ ఉద్యోగం కొనసాగించలేక పోయింది చిట్టి.
మళ్లీ ఆ రాజారావు బావగారే ఈ చిన్న మరదలు చిట్టెమ్మను ఆడవారికి హితవైన ప్రభుత్వ ఉద్యోగం అదే మహిళా సంక్షేమాధికారిణిగా గుంటూరులోకాక, మంగళగిరిలో ఇప్పించారు. అలా స్థలం మార్పు, ఉద్యోగంలో కొత్తదనం, అందులోనూ చుట్టుపట్ల ఊర్లకు క్యాంపులకు వెళ్లడం కొంతవరకు చిట్టి జీవితంలో మార్పు చోటు చేసుకుంది.
సుబ్బారావు ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యాడు. అంతలో చిట్టెమ్మ అక్కయ్యలు, అన్నయ్యలకు వివాహాలవ్వడం.. తన వంతు వివాహ ప్రసక్తి రావడంతో కాస్త వయస్సు పరిజ్ఞానం పెరగడంతో ధైర్యం పుంజుకున్న చిట్టి తన కోసం సంబంధాలు చూడద్దని, పెళ్లిచూపులనీ, అదనీ ఇదనీ తనకు ఉత్తరాలు వ్రాయడం, గుంటూరు పదేపదే రమ్మని అనకుండా గట్టిగా తనకిక పెండ్లి ఊసులు చెప్పద్దనీ తననలా ఉద్యోగంలో మంచి పేరుతోబాటు ప్రమోషన్ పొందేలా వదిలెయ్యమని తండ్రితో కచ్చితంగా చెప్పేసింది. బావ రాజారావుగారు కూడా.. ఇలా అవివాహితగా ఉద్యోగం చేయడం, ఊర్లు ఏలే పనిలో కాదమ్మా చిట్టెమ్మా నీ జీవితం ఓ ఇంటి కోడలు కావాలని మా అందరి అభీష్టం.. అని కూడా నచ్చజెప్పబోయారు.
పోలీస్ ఉద్యోగి అన్నది తప్పితే తనను ఆ సుబ్బారావుకిచ్చి చేయకపోవడమేంటి రంగు తక్కువే కానీ బావ స్ఫురద్రూపి ఆజానుబాహువు హుందాగా ఠీవి ఉట్టిపడే ఆయన్ను పొమ్మన్నారు. మనసొక చోట, మనువొక చోట ఎంత జమీందారీ హోదాగల వారింటికయినా నేను కోడలుగా పోలేనని చిట్టెమ్మ మనస్సులో అవివాహితగా మిగిలిపోవాలని దృఢంగా భీష్మించుకుంది. గుంటూరు వచ్చినప్పుడల్లా వాళ్లు పెళ్లి ప్రసక్తి తేవడం ఆమె కన్నీరుమున్నరుతో ఉద్యోగానికి వెళ్లిపోవడం జరిగేది. ఆ అమ్మాయి జీవితం వెనె్నల కాచిన రేయిని చేశామా అని అనుకుని క్షంతవ్యులయ్యేవారు ఇంటిల్లిపాది. విధి అలా వ్రాయబడింది కాబోలు అనుకుని సమర్థించుకున్నారే కానీ తామే ఆ విధిని తమ నిర్ణయాలతో మార్చేశారని గ్రహించలేక పోయారు.
* * *
అవి ఎలక్షన్ రోజులు. ఒకరోజు రాజారావుగారి ఫోన్ మోగింది. ‘బావా! నా ఎలక్షన్ కాగితాలున్న ఫైలు జీపులో పెట్టి, ఆఫీస్‌లోకి వెళ్లి వచ్చేలోగా మాయమైంది. ఇప్పుడేం చేయాలో అర్థంకాక మీకు ఫోన్ చేశాను. నా ఉద్యోగం ఊడే పరిస్థితి. పోలీసుస్టేషన్‌లో చెప్పే విషయం కాదు బావా! మీరు ద్రోణాచలం నుండి విజయవాడకన్నా, మంగళగిరికన్నా ఎకాఎకిని బయలుదేరి రండి. రామ్‌సింగ్ అన్న మీ స్నేహితుడే ఇక్కడ జిల్లా అధికారి అని తెలిసింది. మీరు చెబితే వెంటవెంటనే ఆ ముఖ్యమైన నా ఫైల్‌ను ఆరాతీసి తేగలరు రండి. దయచేసి రావాలి..’ అని ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ చిన్న మరదలు చిట్టెమ్మ ఏమరుపాటు ఎలక్షన్ డ్యూటీలో వున్నా, ఆమెకి ఒక మచ్చలా తీయలేని రికార్డు అవ్వకూడదు అని రాజారావు ‘సిరికింజెప్పడు..’ అన్నట్లు భార్య శారదమ్మకు కూడా చెప్పకుండా బయల్దేరి వెళ్లాడు. ఆఘమేఘాల మీద మిత్రుడు కలెక్టర్ రాంసింగ్‌ను హెచ్చరించి ఆ ఫైల్ కొరకు వేటాడుతున్నప్పుడు, ఆ ఫైల్ చిట్టెమ్మ జీపు దిగగానే అదే ఎలక్షన్ డ్యూటీలో యాదృచ్ఛికంగా ఉన్న సుబ్బారావు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఆ ముఖ్యమైన కాగితాలున్న ఫైల్ చిట్టెమ్మ సీటు మీదుంచి జీపు దిగి ఆఫీసులోకి సరసరా వెళ్లిన తరుణం చూసి చేజిక్కించుకున్నాడు సుబ్బారావు. ఆయనకు మంచి అవకాశం. ఆ ఫైల్ ఆమెకు అందాలంటే తప్పక చిట్టెమ్మ ప్రత్యక్షంగా తనను కలిసి అందుకోవాలి అని ఆంక్ష పెట్టాడు. విధిలేని పరిస్థితి. ముఖాముఖి ఆ ఉభయ ప్రేమికులు చూసుకున్నారు. ఆ క్షణ ప్రభావం విధిలేక ఇరువురి బలహీనతో, వారిలో అణగారుతున్న ప్రేమ క్షణాల్లో మళ్లీ చివురించి మొగ్గ తొడిగి ప్రకృతిలో పులకింత.. ఆ ఉభయుల్లో గిలిగింత.
దైవానుగ్రహం.. ఆ ఎలక్షన్ ఫైల్ ఎవరో, మరెవరో చాలా కఠినమైన పోలీస్ ఆఫీసర్ చేతిలో పడలేదు. బావ తన వాళ్లు వద్దనుకున్న పోలీసు బావ సుబ్బారావు చేతుల్లో పడింది. ఈ అదను అనుకోకుండా, ఆయనకు అనుకూలం కావడం, కలెక్టర్‌గారు తన్ను రావించక మునుపే సుబ్బారావు పోలీసు అధికారిగా ఎకాఎకిని చిట్టెమ్మను తన ఫైలును స్వయంగా అందుకోవడానికి రమ్మని కబురుపెట్టాడు. తప్పలేదు. అక్కర తనది. వెళ్లింది. ఎనే్నళ్లకో చూసుకుని, ఎదురెదురుగా మాట్లాడుకునే భాగ్యం.. ఇప్పుడే నేను శపథం చేస్తున్నా చిట్టీ! మీ నాన్నగారు నన్ను పోలీస్ పోలీస్ అని ఎద్దేవా చేసి, నన్ను నా ప్రేమను భగ్నం చేశారు. ఇప్పుడు మళ్లీ మళ్లీ చెబుతున్నాను. నా భార్య సువర్ణ ననె్నదిరించదు. నీకు తాళి కట్టి నా ద్వితీయ కళత్రంగా చేసుకుని తీరతాను. ఇదే నా ఆన.. నాది మంగమ్మ శపథం. ఇప్పుడే కట్టుబట్టలతో మనమిద్దరం అన్నవరం కొండకు ఈ జీపులోనే వెళ్లిపోవాలి. ఇందుకు నీవు సుముఖురాలివా కాదా అనే మీమాంస నాలో లేదు. ఈ వివాహం జరిగి తీరుతుంది. అలనాడు కుటుంబ వ్యవస్థ సంప్రదాయం కట్టుబాట్లకు తలవంచి సమాజానికి ఎదురు తిరుగలేని యువతీ యువకులం. అలా ఈ పెళ్లి జరగడం, పిల్లల తండ్రినవ్వడం.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కూడా అయిందనిపించిన నా జీవితంలోకి చిట్టిని నా ప్రేమను పండించుకుంటాను. నీవు నా దానవని అందుకే ఇలా కన్యగా నలభై పడినా నిలిచిపోయిన నీ ప్రేమకు పట్ట్భాషేకం చేసి తీరుతాను. సమయం లేదు చిట్టీ! పద’ అంటూ చిట్టెమ్మ అంగీకారం, పెదవి విప్పలేని ఇష్టమైన జీవిత సూచన బావ చేస్తుంటే కాదనే మనస్సు, శక్తి లేదు. ఇందుకేనా నా ఫైల్, నా జీవిత ఫైల్‌గా మారింది? అనుకుంటూ ఆయన వెంట, తాను కోరిన, తాను ప్రేమించి పదిలపరచుకున్న హృదయ పేటికలోని రాజు, రారాజు, తన బావ సుబ్బారావు తొలి భార్యకు సవతి, ఆ బిడ్డకు సవితి తల్లి కాబోతున్నానన్న ఆలోచన మస్తిష్కంలో మెదలక ముందే అన్నవరం చేరుకున్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్. అక్కడ నిత్యం సామూహిక వివాహాల తంతు జరుగుతోంది. క్షణాల మీద బాసికాలు, మధుపర్కాలు ధరించి.. అనుకోకుండా, జీలకర్ర బెల్లంతో తమలపాకు లిరువురి శిరస్సుల నలకరించడం, పుస్తెలు మెడలో పడడం.. అనుకోకుండా శుభకార్యం, వివాహ తంతు ముగిసి, ఇద్దరూ తమ అభిమతం అడిగి వచ్చినట్లు జరిగిపోయింది.
అన్నవరం సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో తలపై అక్షింతలు, తలంబ్రాలు, మెళ్లో హారాల మార్పిడి! ఆహా! ఆ తంతు అనుకోకుండా సుబ్బారావు చిట్టెమ్మలకు దూరపు బంధువు కంటపడింది. ఆ రోజుల్లో చరవాణి వాడుక అంతగా లేకపోయినా ఆకాశవాణిలా అతడు, ఈ వివాహ వార్త అందరికీ అందించేశాడు. ఒక పోలీస్ ఉద్యోగి కంట కూడా పడ్డారు ఆ నూతన వధూవరులు. ఎలెక్షన్లకు, డ్యూటీకి వెళ్లడానికి మూడు రోజులుండడం వారికి కలిసి వచ్చింది. అక్కడే సత్రంలో గర్భాదానం కూడా ఎంతో అపురూపంగా జరిగిపోయింది.

అలా సుబ్బారావు చిట్టెమ్మల చిరకాల ప్రేమాయణం ఇటు అటు పెద్దల ప్రమేయం లేకుండా స్వామివారి ఆశీస్సులతో ఒక నూతన జీవన స్రవంతికి నాంది పలికింది. అలా అతడిది మంగమ్మ శపథం అని చెప్పక చెబుతోంది. కలెక్టర్‌గారి ప్రమేయం, రాజారావుగారి ప్రమేయం, శ్రమ లేకుండానే చిట్టెమ్మ ఎలక్షన్ ఫైల్ సుబ్బారావు చేతుల మీదుగా అందుకోవడమేమిటి, ఏకంగా పాణిగ్రహణం కూడా అయి, ఎవరి దారిని వారు పనుల్లో మునిగిపోయారు. విషయం తెలిసిన రాజారావుగారికి, మరదలు ప్రేమ పెళ్లి సుఖాంతమయిందని, మరో ప్రక్క ఆమె రెండవ భార్యగా ఆ ఇంట ఎలా భావి జీవితాన్ని మలుచుకుంటుందో అన్న చిరు భయంతో ఊరెళ్లిపోయారు రాజారావు బావగారు.
ఎప్పుడైనా, ఎవరైనా ‘ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? ఇప్పటికీ పుత్తడిబొమ్మలా ఎంత ముద్దొస్తున్నావో చిట్టీ?’ అని అంటే చిట్టెమ్మ ‘నాకింకా పెళ్లేంటి? ఎప్పుడో నేల మిలిటరీకి దరఖాస్తు పెట్టుకున్నా. ఎప్పుడొస్తుందో పిలుపు’ అంటూ గొప్ప వేదాంతం, వ్యంగ్యం, వ్యధ జోడించి తెచ్చికోలు నవ్వుతో సమాధానమిచ్చి, కన్నీళ్లాపుకోలేక అందని ప్రేమ నిట్టూర్పుతో చెక్కిళ్లపై ఆరిపోతున్న కన్నీటి ముత్యాలు తుడుచుకుంటూ ముందుకు నడిచేది చిట్టెమ్మ. అలా తాను కోరిన బావ ధర్మపత్ని అయింది. అది ద్వితీయమా అన్న ప్రశ్నకు తావులేని ఆనంద పరవశం, సుబ్బారావు వొడిలో భావి జీవిత యాత్ర!
సుబ్బారావు తన మంగమ్మ శపథం కేవలం నెరవేర్చుకోవడానికి కాదు. తాను చిరుప్రాయం నుండి చిట్టెమ్మను తన దానిని చేసుకోవాలన్న కోరిక ఇలా ఫలించకుండా పోతుందని, కించిత్తు కూడా అనుమానం లేదు. వరసైన మరదలు, పెళ్లి చేసుకుంటానంటే కాదంటారా అనుకున్నాడు. కానీ ఇనే్నళ్ల తర్వాత ఎలక్షన్ ఫైల్ తమనిద్దరినీ ఒకటి చేసింది. అప్పుడప్పుడూ ఎంత సంసారంలో సరిగమలు పాడుకుంటున్నా, ఎక్కడో అపస్వరం! తన చిట్టి మనసులో మెదిలి కలవరపెట్టేది. తనను భార్యగా పొందే భాగ్యం ఇక రాదన్న మాటే! ఎందుకు రాదు? ఎందుకు రాకూడదు? నా మీద నిర్మల ప్రేమతోనే కదా చిట్టి పెళ్లి చేసుకోలేదు. చూద్దాం అని ఒకలాంటి మొండి ప్రతిజ్ఞ తనలో తాను చేసుకుంటూ కుంగుబాటుకులోనై, మళ్లీ ఆ శపథం ఇలా నెరవేరిందని మురిసిపోయాడు.
సుబ్బారావు పోలీస్ నుండి అంచెలంచెలుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎదిగి మంచి ఇల్లు కట్టుకున్నాడు. క్రింద భాగం మొదటి భార్య, పిల్లలకు, అద్దెకున్నవారు ఖాళీ చేసిన మేడపైన అన్ని సౌకర్యాలతో చిట్టెమ్మను ఉంచి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. పిల్లలు కూడా, చిన్నమ్మా! అంటూ చనువుగా సౌమ్య స్వభావి చిట్టెమ్మతో అభిమానంగానే ఉండేవారు. తన భగ్నవౌతున్న ప్రేమ కథ ఇంత అందంగా, సౌభాగ్యంగా పెళ్లి, భర్త, ఇల్లు, సంసారం చక్కగా అమరుతాయని చిట్టెమ్మ కలనైనా అనుకోలేదు!
అమ్మా నాన్నగార్లను సమాధానపరచి, చిట్టెమ్మ ఆఖరి అక్కయ్య సావిత్రమ్మ, విజయవాడ వెళ్లి, చిట్టి కాపురం చూసి సుబ్బారావుతో యధావిధిగా తమ ఇంటికి రమ్మని సంప్రదాయంగా స్వాగతించింది. అలా అప్పుడప్పుడు ఉభయులు గుంటూరు విచ్చేసేవారు. రెండు రోజులుండి వెళ్లిపోయేవారు.
‘కాలం’ ఒక్కలాగే ఎల్లకాలం గడవదు కదా! సుబ్బారావు వయసుతోపాటు అప్పుడప్పుడూ నలత పడటం, ఔషధ సేవనం, ఇద్దరు భార్యలు, పిల్లల సపర్యలతో కోలుకోవడం సాగేది. కానీ విధి ఆయన్ను, సువర్ణ, చిట్టెమ్మల, పిల్లల రుణం తీరిందన్నట్లు కాలం చేశాడు. ఆయనకేం, అన్నీ సవ్యంగా జరుపుకొని వెళ్లిపోయిన అదృష్ట జాతకుడు! కాకపోతే ఒకరు కాదు, ఇద్దర్ని వితంతువులుగా మిగిల్చి వెళ్లాడు! అలా అని తనకై విలపించే వారికి ఏమీ లోటు చేయలేదు. దిగువ భాగం పెద్ద భార్యకు, మేడ చిట్టెమ్మకు రాశాడు. తదనంతరం పిల్లలకు సమభాగాలుగా వీలులో పేర్కొన్నాడు.
చిట్టెమ్మను ‘పిన్నమ్మా’ అంటూ సవతి కొడుకులు చేదోడు వాదోడుగా ఆమెను నొప్పించకుండా చూసుకునేవారు. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడం, ఉబ్బసం వ్యాధి చిట్టెమ్మను పీడించేది. ఆసుపత్రిలో చేర్చి లోటు లేకుండా చూసుకున్నా కూడా సుబ్బారావు తన దగ్గరకు రమ్మని కలలో పలుమార్లు పిలిచినట్లు భ్రమిస్తూ చిట్టెమ్మ పొరపొచ్చాలు లేకుండా సువర్ణ కూడా సపర్యలు చేస్తున్నందుకు తృప్తిగానే చిట్టెమ్మ సుబ్బారావు ద్వితీయ కళత్రం తాను జన్మనివ్వకపోయినా, తన బిడ్డలుగానే సపర్యలు చేయగా వారి చేతుల మీదుగా కాలం చేసింది. పుట్టింటి తరఫున సావిత్రక్కయ్య మాత్రం దహన సంస్కారాలకు వచ్చి నిలబడింది. పెద్ద కొడుకు పున్నామ మరకం నుండి విముక్తురాలుగా చేయగా, అపసవ్యంలో సవ్యం అని తృప్తిగా మరో లోకానికీ, మంగమ్మ శపథం తనదంటూ జీవితంలో ఒక దశలో చిట్టెమ్మను తనదానిగా చేసుకొని, తాను వెళ్లి, ఆమెను కూడా ఊర్థ్వ లోకాలకు పిలిపించుకున్నాడు సుబ్బారావు! ఇలా వుంటాయి కొన్ని జీవితాలు. దైవం కాదు, సుబ్బారావే, తమ ఇద్దరి విధిగా రూపకల్పన కర్త! విధాత!
*

-పరిమి శ్యామలాదేవి 9440034545