సబ్ ఫీచర్

కళ్లకు రక్షణ.. చూపుకు ఆకర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావణ్య పక్కింట్లో ఉండే సుగుణ ఆరు నెలల తన బిడ్డకు స్నానం చేయించి కనుబొమ్మలను అందంగా ఐబ్రో పెన్సిల్‌తో దిద్దుతుంది. ఇంత చిన్న వయసు బిడ్డకు కనుబొమ్మలు సరిచేయటమేమిటండి! అని లావణ్య అమాయకంగా అంది. చిన్నప్పటి నుంచే కనుబొమ్మలను పెన్సిల్‌తో సరిచేస్తే పెద్దయ్యేటప్పటికీ ఒత్తుగా ఉండి అందంగా కనిపిస్తాయండి..! అని సమాధానం చెప్పింది. నిజంగానే ఒత్తయిన కనుబొమ్మలు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఎందుకంటే కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వారి చూపులు సైతం ఆకర్షిస్తాయి. కొంతమందికి పుట్టుకతోనే ఒతె్తైన కనుబొమ్మలు ఉంటాయి. మరికొంతమందికి పలుచగా ఉంటాయి. అలాంటివారు తమ కనుబొమ్మలను ఒత్తుగా చేసుకునేందుకు, సహజ సిద్ధమైన దినుసులతో చక్కగా చేసుకోవచ్చు.
ఇలా చేయండి..
* ఆల్మండ్ నూనెలో విటమిన్ ఏ,బీ,ఈ ఉంటాయి. వీటివల్ల జుత్తుకి తగిన పోషణ అంది జుత్తు బాగా పెరుగుతుంది. ఆల్మండ్ నూనెని కనుబొమ్మల మీద వలయాకారంలో మసాజ్ చెయ్యండి. రాత్రంతా అలా ఉంచి పొద్దునే ముఖం కడుక్కోండి.
* ఆలొవెరాలో ఉండే అలోనిన్ అనే పదార్ధం జుత్తు పెరుగుదలకు తోడ్పడుతోంది. ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు మీ కనుబొమ్మల మీద ఆలోవెరా జెల్‌ని మసాజ్ చెయ్యండి. మంచి ఫలితం వచ్చేవరకూ ఇలా రోజూ చెయ్యండి.
* కొబ్బరి నూనెని కనుబొమ్మలకి పట్టించడం వల్ల కనుబొమ్మల జుత్తు ప్రొటీన్ కోల్పోకుండా ఉండి ఒత్తుగా పెరుగుతాయి.
* కనుబొమ్మలకు ఆముదం పట్టించి కొంతసేపాగి కడిగెయ్యండి. ఆముదంలో ఉన్న సహజ గుణాలు కనుబొమ్మల జుత్తు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తాయి. ఇలా కనీసం ఆరు నెలలు చేస్తే మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
* గుడ్డుసొనలో ఉన్న బయోటిన్ జుత్తు పెరుగుదలకి తోడ్పడుతుంది. కనుబొమ్మల మీద గుడ్డుసొనని పట్టించి ఇరవై నిమిషాలాగి వెచ్చని నీటితో కడగండి. ఇలా రెండు వారాలు చేస్తే మంచి ఫలితం పొందుతారు.
* మెంతులు వారానికి రెండుసార్లు మెంతుల పేస్ట్ అప్లయ్ చేస్తూ ఉంటే.. మీ కనుబొమ్మలు ఒత్తుగా మారిపోతాయి. మెంతుల పేస్ట్ రాసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.