Others

రవితేజతో జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే మెగాహీరో వరుణ్‌తేజ్ సరసన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాలభామ ప్రజ్ఞాజస్వాల్‌కు ఇప్పుడు టాలీవుడ్‌లో అవకాశాల వెల్లువ ఎక్కువైంది. ప్రస్తుతం ఈ భామకు పలు అవకాశాలు వస్తున్నాయట. తాజా సమాచారం ప్రకారం క్రేజీ హీరో రవితేజ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హీరోగా నటించే ‘ఎవడో ఒకడు’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఇప్పటికే ఒక హీరోయిన్‌గా ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. మరో హీరోయిన్‌గా ప్రజ్ఞాజస్వాల్‌కు అవకాశం దక్కిందట. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. రవితేజ లాంటి మాస్ హీరో సరసన హీరోయిన్‌గా అవకాశం కొట్టేసిన ప్రజ్ఞాకు ఈ చిత్రం ఎలాంటి ఇమేజ్‌నిస్తుందో చూడాలి!