రాష్ట్రీయం

పట్టాతోపాటే ఉద్యోగపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కారీ కళాశాలల విద్యార్థులకు వరం
టిఐఎస్‌ఎస్‌తో నూరు కాలేజీల ఒప్పందం
ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి
రాజమండ్రి, డిసెంబర్ 4: ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థుల చదువు పూర్తయ్యేసరికి ఒక చేతిలో డిగ్రీ పట్టా, మరోచేతిలో ఉద్యోగ నియామకపత్రం లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. ఈమేరకు వంద కళాశాలలకు సంబంధించి టాటా సంస్థకు చెందిన టిఐఎస్‌ఎస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాన్నట్టు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్థానిక పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా కృషి చేస్తామన్నారు. సంస్కరణలను అమలుచేసి రాష్ట్రంలోని కళాశాలల్లో నాణ్యమైన విద్య, విద్యార్థుల హాజరీ, ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. అలాగే కళాశాలలకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ బాధ్యతను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకే అప్పగించామన్నారు. ఉన్నత విద్యలో దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్య, నిధుల సద్వినియోగం తదితర 10 అంశాలతో రూపొందించిన అధ్యయనంలో ఆంధ్ర దేశంలోనే ఉత్తమంగా నిలిచిందన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర శిక్షా అభియాన్ (రుసా) కింద నిధులను సాధించడంలో దేశంలో 3వ స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. అయితే విద్యార్థి, అధ్యాపకుల నిష్పత్తిలో 7, అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉందన్నారు. అలాగే మహిళా ఉద్యోగాల కల్పనలో 2వ స్థానం, వౌలిక సదుపాయాల్లో 10వ స్థానం, బాలికల నిష్పత్తిలో 21వ స్థానంలో ఉందని సుమితా దావ్రా వెల్లడించారు. రూ. 407 కోట్ల రుసా నిధుల నుంచి 72 కోట్లతో కొత్త కళాశాల భవనాలు, 218 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 12 లక్షల మంది విద్యార్థుల్లో 50శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 57, ఎయిడెడ్ కళాశాలల్లో 41, ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య కన్నా అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల నిష్పత్తి ప్రకారం అధ్యాపకులను నియమిస్తామన్నారు. దీనిలో భాగంగా అధ్యాపకులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. అధ్యాపకుల్లోనూ 13 అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించే చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రతీ నెలా కళాశాలలు, యూనివర్శిటీల్లో సూక్ష్మస్థాయిలో అధ్యాపకుల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సంస్కరణల్లో భాగంగా సెమిస్టర్, కోరుకున్న పాఠ్యాంశాన్ని చదువుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నామని వివరించారు. మొత్తం 32 అంశాల్లో సంస్కరణలు అమలు చేస్తున్నట్టు సుమితా దావ్రా వివరించారు.