రాష్ట్రీయం

తిరుమలపై అసత్య ప్రచారాలు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జెఇఒ శ్రీనివాసరాజు
తిరుమల, నవంబర్ 24: గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాల నేపధ్యంలో తిరుమలలో వరదనీరు చేరి ఆలయం మునిగిపోయిందని, ఘాట్ రోడ్డులో భారీగా బండరాళ్ళు జారిపడుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫోటో మార్ఫింగ్‌తో జరుగుతున్న అసత్య ప్రచారాలను శ్రీవారి భక్తులు నమ్మవద్దని తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు కోరారు. మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో తిరుమల్లోని శ్రీవారి ఆలయం నీళ్లలో ఉండిపోయిందని, ఘాట్ రోడ్డులో జారిపడుతున్న బండరాళ్లు భక్తుల మీద పడిపోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం 99శాతం అవాస్తమన్నారు. ఇలాంటి అసత్య ప్రచార వల్ల భక్తులు తిరుమలకు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులకు ఆవేదన కలిగించే అంశమన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల ఎవరికీ ఏమీ ఒరిగేదిలేదన్నారు. సోషల్ మీడియా కాకుండా టిటిడి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఆయన భక్తులకు సూచించారు. ఎవరూ భయాందోళనలకు గురికాకుండా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని చెప్పారు. తిరుమలేశుని ఆలయంలో కురిసిన వర్షం నీరు బయటకు పంపడానికి ఆధునిక డ్రెయిన్‌లైన్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ రోడ్డులోని కొన్ని ప్రాంతాల్లో బండరాళ్ళు జారిపడుతున్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో వాహనాలను తిరుమలకు అనుమతిస్తామన్నారు. ప్రతి సంవత్సరం తిరుమలలో 136 సెం.మీ. వర్షపాతం కురిస్తే ఈ సారి నవంబర్ మాసానికే 193 సెం.మీ.వర్షపాతం నమోదైందని చెప్పారు. దీంతో తిరుమలలోని జలాశయాలు నిండాయని, హెయిర్ పిన్స్ వద్ద బండరాళ్ళు జారిపడటం ఆందోళన కలిగించిందన్నారు. అయితే ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో అధిగమించడానికి నిరంతరం కృషి చేసిన టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ, ఇంజినీరింగ్,్ఫరెస్ట్ విభాగం అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా జెఇఓ శ్రీనివాసరాజు అభినందించారు.