రాష్ట్రీయం

ఆంధ్రాలో ఇంటర్ ఫస్టియర్ చదివినా తెలంగాణలో లోకల్ అభ్యర్థులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: పదో తరగతి వరకూ తెలంగాణలో చదివి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ మాత్రం ఆంధ్రాలో చదివిన తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి తెలంగాణకు వచ్చిన అభ్యర్ధులను లోకల్ అభ్యర్ధులుగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో వారు భవితవ్యంపై ఇంతకాలంగా కొనసాగుతున్న అయోమయం తొలగిపోయింది. ఫస్టియర్ పరీక్షలు ఆంధ్రా ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించినా, ఆ మార్కులను సెకండియర్‌లో పరిగణించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు హామీ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ఆంధ్రాలో చదివిన ఫస్టియర్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అలాగే తెలంగాణలో చదివిన ఆంధ్రా విద్యార్ధులు జూన్ 2017లోగా ఆంధ్రాకు వస్తే వారిని ఆంధ్రా విద్యార్ధులుగానే పరిగణిస్తామని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంతో మరో విద్యాసంవత్సరం ఇరు రాష్ట్ర విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నాయి.

శంషాబాద్ ఎయర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత
హైదరాబాద్, డిసెంబర్ 3: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. దుబాయి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఒక కిలో బంగారం, కిలో వెండి పౌడరును స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు.