రాష్ట్రీయం

ఇంటెలిజెన్స్ విభాగంలో అదనంగా 224 పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ * విజయవాడలోనే నిఘా కార్యాలయం
హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసు నిఘా విభాగంలో మానవ వనరుల కొరతను తీర్చేందుకు రాష్ట్రప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ శాఖలో అదనంగా 225 పోస్టుల భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసంది. రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసు, స్పెషల్ ఇంటెలిజెన్స్ సెల్, ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఎస్పీ కేడర్, నాన్ ఎస్పీ కేడర్, అదనపు నాన్ ఎస్పీ కేడర్, ఎనిమిది డిఎస్పీ పోస్టులను ముందు భర్తీ చేస్తారు. హోం శాఖ దాదాపు 370 మంది సిబ్బందిని నియమించేందుకు అనుమతి అడిగింది. కాని ప్రభుత్వం 225 పోస్టులకు అంగీకరించింది. పోలీసు శాఖలో పనిచేసే సిఐ, ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్లలో నిఘా విభాగంలో చేరే వారికి ఆసక్తి ఉంటే ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటీవల మావోయిస్టు కార్యకలాపాలు పెచ్చుమీరాయి. అలాగే గుంటూరులో నకిలీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమలో గ్రూపు తగాదాలు మళ్లీ పెరుగుతున్నాయి. చిత్తూరు నగరపాలక సంస్ధ మేయర్ దారుణ హత్య ఉదంతం నిఘా వైఫల్యం వల్లనే జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి నేరాలతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే నిఘా విభాగం ఉండాలని, అటవీ శాఖతో కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి పోలీసు శాఖ ప్రతిపాదనలు పంపింది. నిఘా విభాగంలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయనున్నారు. రాష్ట్ర స్ధాయి ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయనున్నారు. విభజన తర్వాత ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పసిగట్టే నైపుణ్యం ఉన్న నిఘా సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోయారు.