రాష్ట్రీయం

ఐఏబి మీట్ రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన సమావేశం
నెల్లూరు, డిసెంబరు 12: రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఐఏబి సమావేశం ఆద్యంతం రసాభాసగా సాగింది. శనివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో జరిగిన ఐఏబి సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శిద్దా రాఘవరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కొన్ని ఆక్రమణ ఫోటోలను చూపుతూ బల్లను గట్టిగా గుద్దుతు నగర శాసనసభ్యులు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడిన తీరును నిలువరించేందుకు వెంకటగిరి ఎంఏల్‌ఏ కురుగుండ్ల రామక్రిష్ణ ప్రయత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన అనిల్ తాను ఒక గౌరవప్రదమైన శాసనసభ్యుని మరిచి సహచర సభ్యుడినని మరిచి నోటికి వచ్చినట్లు సహచర శాసనసభ్యులను దూషించటమే కాకుండా దమ్ముంటే బయటకు రండి తేల్చుకుందామంటు చొక్కా మడిచి తన స్థానం నుండి పక్కకు వచ్చి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. దీంతో కోపగించుకున్న కురుగొండ్ల కూడా రెచ్చిపోయి బయటకు రా చూసుకుందామంటు తన స్థానంలో లేచి నిలబడి బిగ్గరగా మాట్లాడుతూ ఎం ఏల్ ఏ ను అడ్డుకున్నారు. మరింత రెచ్చిపోయిన అనిల్ ఆవేశంగా ఎం ఎల్ ఏ రామక్రిష్ణను దూషిస్తు మాట్లాడకుండా కుర్చో లేదంటే బయటకు రా తేల్చుకుందామంటూ బెదిరింపు ధోరణలో మాట్లాడారు.
అదే సమయంలో ఎంఎల్‌సి వాకాటి నారాయణ రెడ్డి కలగచేసుకుని ఎంఎల్‌ఏ అనిల్ ప్రవర్తన పై తన నిరసనను తెలియచేస్తూ చూసుకోవటం,తేల్చుకోవటం లాంటి భాష ఉపయెగించటం రౌడి రాజ్యాన్ని తలపిస్తుందని, రౌడిలా, గూండాల్లా భయపెట్టాలని చూస్తే బెదిరిపోయెది లేదని, సహించేది లేదని వైసీపీ ఎంఎల్‌ఏలను ఆయన హెచ్చరించారు. ఈ దశలో మరోసారి రెచ్చిపోయిన అనిల్ రోజుకో పార్టీ మారుతూ, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నీకు నన్ను విమర్శించే అర్హత లేదని ఆవేశంగా,దుందుడుకు మాటలతో వాకాటి వద్దకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో నోరు మూసుకుని కుర్చోమంటు వాకాటి నారాయణరెడ్డి అనిల్‌ను హెచ్చరించారు. ఈ మాటలతో విపరీతమైన ఆగ్రహంతో రెచ్చిపోయిన అనిల్ మరోసారి చొక్కా మడిచి దమ్ముంటే చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఈ సమయంలో ఎం ఎల్ సి వాకాటి నారాయణరెడ్డి ఎం ఎల్ ఏ అనిల్ మధ్య నడిచిన బూతు పురాణం విని సభలో ఉన్న ప్రతి ఒక్కరు నిర్ఘాంతపోయారు. అదే సమయంలో ఎంపి మేకపాటి జోక్యం చేసుకుని వారందరికి సర్దిచెప్పి శాంతింప చేశారు.
18నుంచి కాలువలకు నీళ్లు
జిల్లాలో మొదటి పంటకు నిర్దేశించిన ఆయుకట్టుకు పూర్తిస్థాయిలో ఈనెల 18 నుండి సాగునీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన విలేఖరులకు వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరిందని అందువల్ల నిర్దేశించిన అందరికీ సాగునీటిని అందించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకుని అందుకు అనుగుణంగా సాగునీటి విడుదలను పూర్తిస్థాయిలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.