రాష్ట్రీయం

డిసెంబర్ నెలాఖరులోగా 120 జూనియర్ జడ్జి పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు జడ్జి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి

మిర్యాలగూడ , డిసెంబర్ 5: రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న 120 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులు ఈనెల 31వ తేదీలోగా భర్తీ కానున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవెళ్లి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహం లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలకు సంబంధించి అన్ని అర్హత పరీక్షలు పూర్తయ్యాయని, ఇక నియామకాలే మిగిలాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏ న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంచడం లేదని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో సబ్‌కోర్టు, మిర్యాలగూడలో అదనపు సబ్‌కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు ప్రతిపాదనలు హైకోర్టు ముందున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయిస్తే త్వరలో భవన నిర్మాణం చేపడతామని ఆయన అన్నా రు. లోక్ అదాలత్‌లో రాజీమార్గం ద్వారా కేసులను ప్రజలు పరిష్కరించుకోవాలని కోరారు. ఉచిత న్యాయ సహాయం విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం లక్ష రూపాయల ఆదాయం పేదలకేనన్నారు. నేడు పెరుగుతున్న ధరల దృ ష్ట్యా ఆదాయ పరిమితిని కూడ పెంచా ల్సి ఉంటుందని, ఇందుకు ఉన్నత న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మిర్యాలగూడలో కో ర్టు సముదాయం నిర్మాణానికి 6 కోట్ల రూపాయల వ్యయం తో ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. తొలుత ఆయనకు స్థానిక సీనియర్ సివల్ జడ్జి వై.సత్యేంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు, స్పెషల్ మెజిస్ట్రేట్ పి.లక్ష్మినారాయణ, బార్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీ్ధర్‌గౌడ్, ఎపిపి ఎ.నరేందర్‌రెడ్డి, ఎజిపి యాలాద్రి, న్యాయవాదులు గూడురు శ్రీనివాస్‌రావు, గోద వెంకట్‌రెడ్డి, వేణుగోపాల్, జె.శ్రీనివాస్‌లు స్వాగతం పలికారు.