రాష్ట్రీయం

అన్ని కేసులూ విధిగా నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి, తెలంగాణ డిజిపిలను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 7: గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కాగ్నజబుల్, నాన్ కాగ్నజబుల్ నేరాల్లో తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఎపి, తెలంగాణ రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది. వి.మహేంద్ర, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటీషన్లు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అన్ని కేసులను నమోదు చేయడం లేదని తెలిపింది. ప్రాధమిక విచారణను ఏ కేసులోనైనా 7 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ పివి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. కాగ్నజబుల్ నేరాల్లో ఏ పోలీసు ఆఫీసర్ కేసు నమోదు చేయకుండా తప్పించుకోలేరని, విధిగా నమోదుచేయాలని ఆదేశించారు. కేసు నమోదు చేయని అధికారి చట్టప్రకారం చర్యలకు అర్హుడని జస్టిస్ వెల్లడించారు.