రాష్ట్రీయం

ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టపై అస్పష్ట వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి సర్కార్ తీరుపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను కాగ్నిజబుల్ నేరంగా, నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారా లేదా అనే అంశంపై స్పష్టమైన వైఖరిని రాష్ట్రప్రభుత్వం తెలియచేయకపోవడం పట్ల హైకోర్టు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలో హైకోర్టు ఇదే అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియచేయాలని ఆదేశించింది. గనుల శాఖ సంయుక్త కార్యదర్శి నివేదికను సమర్పించారు. కాని హైకోర్టు ప్రస్తావించిన అంశంపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని ఉదహరించలేదని న్యాయస్ధానం పేర్కొంది. బండారి పాపిరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోని పక్షంలో పర్యావరణానికి హాని జరుగుతందని, నీటి ఎద్దడి ఏర్పడుతుందని హైకోర్టు పేర్కొంది. ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకునే చర్యలపై ప్రభుత్వం నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 14కు వాయిదావేశారు.