రాష్ట్రీయం

గోదావరి జలాలు మళ్లించి రైతు ఆత్మహత్యలు నివారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరవు నివారణకు యుద్దప్రాతిపదికన చర్యలు
రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలి
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

సిద్దిపేట, డిసెంబర్ 6: గోదావరి జలాలను మళ్లించి.. కాల్వల ద్వారా నీటిని అందించి తెలంగాణను సస్యశ్యామలం చేసి రైతు ఆత్మహత్యలను నివారిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతానికి సాగునీటిని విస్మరించడం వల్లే ఈనాడు కరవు ఏర్పడుతుందన్నారు. కరవు నివారణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
మెదక్ జిల్లా సిద్దిపేట మండలం వెంకటాపూర్‌లో నిర్మిస్తున్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు టనె్నల్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు నిర్మిస్తున్న సాంకేతిక నిపుణులతో కలిసి టనె్నల్ లోపలికి పోయి పనులను పరిశీలించారు. టనె్నల్ నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖర్లతో ఎంపి ప్రభాకర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. 30ఏండ్లుగా ఇప్పటి వరకు ఎప్పుడు లేనివిధంగా జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు చుక్కనీరు కూడా రాలేదన్నారు. సంగారెడ్డికి కనీసం తాగునీరు కూడా అందించలేని కరవు దాపురించిందన్నారు.