రాష్ట్రీయం

ప్రచారానికి నేనూ వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు
హైదరాబాద్, డిసెంబర్ 19: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలను తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం గ్రేటర్ పరిథిలోని 24 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. కృష్ణా నదీ జలాలను తెచ్చి నీటి సమస్య పరిష్కరించామని ఆయన తెలిపారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు టిడిపికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, టిడిపి-బిజెపి కలిసి పోటీ చేసి మెజారిటీ డివిజన్లను కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం బాగా పని చేస్తున్నారని ఆయన అభినందించారు. ఇలాఉండగా ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, నగర పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, టి.టిడిఎల్‌పి ఇన్‌ఛార్జీ అమర్‌నాథ్ బాబు తదితరులు కోరగా, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అనంతరం మాగంటి గోపినాథ్ మీడియాతో మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. షహర్ హమారా-మేయర్ హమారా అనే నినాదంతో ఎన్నికలకు వెళతామని అన్నారు. ఈ నెల 22న ప్రతి డివిజన్‌లో జెండా ఎగుర వేసి జెండా పండుగ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గ్రేటర్ పరిథిలోని ప్రజలు ఇంటి పన్నుల బకాయిలు చెల్లించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతున్నదని ఆయన విమర్శించారు. కంటోనె్మంట్ బోర్డు ఎన్నికల సమయంలోనూ 30 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని ప్రకటించినా ఇంత వరకు మాఫీ కాలేదని ఆయన చెప్పారు. టిడిపి హయాంలో అద్భుతమైన నగరంగా హైదరాబాద్ పేరు లభించిందని, ఇప్పుడు చెత్త నగరంగా చేశారని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నగరానికి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నాలుగు సార్లు అవార్డు లభించిందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 63 డివిజన్లలో మంచి ఫలితాలు సాధిస్తామని అన్నారు. (చిత్రం) గ్రేటర్ తమ్ముళ్లతో భేటీ అనంతరం గదను పైకెత్తి విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్న ఆంద్రప్రదేశ్ సిఎం చంద్రబాబు