రాష్ట్రీయం

అంతటా గోవింద నామస్మరణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, డిసెంబర్ 21: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నల్లగొండ జిల్లా యాదాద్రి క్షేత్రంలో సోమవారం వేకువజామున ఆలయ తూర్పురాజగోపురం వద్ద భక్తుల జయజయ ధ్వానాలు, వేదపండితుల పారాయణాలు, అర్చకస్వాముల వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష్మీనృసింహుడు లక్ష్మీదేవి సహితంగా పట్టు వస్త్రాలు ముత్యాల వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణ్భారణాలతో దివ్యమనోహరంగా ఉదయం 6.42గంటలకు ఆలయ వెండి ద్వారాలు తెరుచుకోగా మబ్బుతెరలలోంచి గరుడవాహణంపై వేంచేశాడు. స్వామి వారి దర్శనంతో పులకించిన భక్తజనం భక్తుల గోవిందనామస్మరణతో యాదగిరికొండ మార్మోగింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారికి భక్తులు మంగళహారతులు పట్టారు. వైకుంఠ ఆలయ ద్వారంలోస్వామి వారిని అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో స్తుతించారు. అనంతరం నమ్మాళ్వార్ సేవ వెంటరాగా స్వామి వారు ఆలయ తిరువీధులలో విహరించారు.
ధర్మపురిలో...
ధర్మపురి: కరీంనగర్ జిల్లాలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, సోమవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవ వేడుకలు కన్నుల పండువగా, వైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్పూర్వం 2.30గంటలకు, వేద మంత్రోచ్ఛారణల మధ్య, గోదావరి నుండి అర్చకులు పవిత్ర నదీ జలాలను కొనితెచ్చి, శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీసమేత నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూలవిరాట్టులకు సంప్రదాయ రీతిలో, మహా క్షీరాభి షేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి వైకుంఠ ద్వార దర్శన పూజల అనంతరం ఉత్తర ద్వారాన్ని తెరువగా, వైకుంఠ ద్వారంనుండి ప్రవేశించిన భక్తులు, నయనానంద భరితులై తనివి తీరా ఇలవేలుపులను దర్శించుకున్నారు. దేవస్థానం ఎసి,ఇఓ. సుప్రియ పర్యవేక్షణలో, అర్చక బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ్ శర్మ, క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్యక్రమాలను నిర్వహించారు.
సంగారెడ్డిలో...
సంగారెడ్డి టౌన్: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వైకుంఠపుర దివ్యక్షేత్రం గోవింద న్మామస్మరణతో మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యుల వారి సమక్షంలో ఉదయం 3గంటల నుండే ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. కలియుగ ధైవమైన శ్రీనివాసుడికి పల్లకి సేవ నిర్వహించి ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. జిల్లా భక్తులతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో...
చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటలో తిరుపతి వేంకటేశ్వరుని ఫ్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్ సమీపంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, బండపల్లి సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.