రాష్ట్రీయం

‘గోవధ నిషేధాన్ని అమలు చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 7: గోవును నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, గోవును మాతగా గౌరవించడం, పూజించడం మన సాంప్రదాయమన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గోవును గౌరవిస్తారన్నారు. కొందరి ప్రవర్తన వల్ల గోవులు అంతరించిపోయేలా ఉందని, ఇందులో భాగమే బీఫ్ ఫెస్టివల్ అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రంలో తలెత్తే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పురాణాలు, వేదాలు సైతం గోవు విశిష్టతను తెలియజేస్తుంటే నేటి కలికాలంలో బీఫ్ ఫెస్టివల్స్ పేరిట గోవధ నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.