రాష్ట్రీయం

రూ. 2,606 కోట్ల పనులకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: విజయవాడ నగరంలో నబూతో న భవిష్యత్‌లా శనివారం ఒకే రోజు 2,606కోట్ల రూపాయల విలువైన ఫ్లైఓవర్‌లు, జాతీయ రహదారుల విస్తరణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వై సుజనా చౌదరి ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో రూ. 447.88 కోట్ల నిధులతో ఆరులైన్ల దుర్గగుడి వంతెన నిర్మాణం, జాతీయ రహదారి 65 నుండి 16 వరకు 5.122 కి.మీల నాలుగు లైన్ల రహదారి విస్తరణ, రూ. 1462.32 కోట్ల నిధులతో ఎన్‌హెచ్ - 65 విజయవాడ నుండి మచిలీపట్నం వరకు గల 64 కి.మీలను నాలుగులైన్ల రహదారిగా విస్తరణ, బెంజిసర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, రూ. 314.43 కోట్లతో ఇబ్రహీంపట్నం సెంటర్ నుండి చంద్రగూడెం వరకు 32.7 కి.మీ వరకు గల ఎన్‌హెచ్ 30ని రెండులైన్లతో పేవ్‌డ్ షోల్డర్ పునః నిర్మాణం, స్థాయి పెంపు, రూ. 480.21 కోట్లతో కత్తిపూడి నుండి కాకినాడ బైపాస్ సెక్షన్ వరకు 26.15 కి.మీ ఎన్‌హెచ్ 216ను నాలుగు లైన్లకు పేవ్‌డ్ షోల్డర్ పునః నిర్మాణం, స్థాయి పెంపు పనులకు శనివారం ఉదయం కేంద్ర రోడ్డు, రవాణా,రహదారులు, నౌకాయాన శాఖమంత్రి నితిన్ గడ్కరీ నగరంలోని భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రులు ఎం వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు సిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు.