రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టు మృతి * డంప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

భద్రాచలం, నవంబర్ 26: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా పలువురు తప్పించుకున్నారు. సంఘటన ప్రదేశంలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ కల్లూరి ప్రకటించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన కాంపోజిట్ బలగాలు ఈ నెల 22న బీజాపూర్ జిల్లా ఆవుపల్లి, బాసగూడ, ఊసూరు పోలీసు స్టేషన్ల పరిధిలో వివిధ బృందాలుగా కూంబింగ్ ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలో గురువారం గంగులూరు పోలీసుస్టేషన్, బాసగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని లెండ్రా, కుర్చోలి అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దాదాపు 15 నుంచి 20 మంది మావోయిస్టులు ఈ బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. సుమారు 100 రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు పారిపోగా ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతదేహం, 12 బోర్ రైఫిల్ ఒకటి, బర్మా తుపాకీ 1, టిఫిన్‌బాక్స్ బాంబులు, విద్యుత్ తీగల బండిల్, డిటోనేటర్, తూటాలు, నక్సల్స్ డంప్ లభ్యమయ్యాయి. విప్లవ సాహిత్యం కూడా లభించినట్లు ఐజీ తెలిపారు. మరోవైపు బుధవారం దండకారణ్య బంద్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలపై దాడులు చేసేందుకు మావోయిస్టులు ప్రయత్నించగా అప్రమత్తమైన జవాన్లు వారిని పట్టుకున్నారు.
ఐదుగురు మావోయిస్టులను కటేకల్యాణ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ఐజీ కల్లూరి, దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ప్రకటించారు. ఇదిలా ఉండగా బస్తర్ ప్రాంతంలో కొంగోలీ అనే గ్రామంలో 5వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు టార్గెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో ఘనశ్యామ్‌దేవ్ అనే జవాన్‌కు గాయపడగా హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండే అటవీప్రాంతంలో మావోయిస్టుల క్యాంప్‌పై కాంపోజిట్ బలగాలు మెరుపుదాడి చేయగా మావోయిస్టులు తప్పించుకున్నారని బీజాపూర్ ఎస్పీ మనీష్‌శర్మ తెలిపారు.