రాష్ట్రీయం

బాక్సైట్‌కు వ్యతిరేకంగా పీసా కమిటీల తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజనుల్లో తొలగని అనుమానాలు
విశాఖపట్నం, నవంబర్ 23: విశాఖ ఏజెన్సీలో ఏర్పాటైన పీసా కమిటీలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానించాయి. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి జారీ చేసిన 97 జిఓను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా, దానికి సంబంధించిన కార్యాచరణను చాపకింద నీరులా సాగిస్తోందన్న అనుమానాలు గిరిజనుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పీసా కమిటీలు రంగంలోకి దిగాయి. ఈ నెల 16న జరిగిన క్యాబినెట్ సమావేశంలో బాక్సైట్ జిఓపై సుదీర్ఘంగా చర్చించి, దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బాక్సైట్‌పై చర్చించిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడిన తరువాత బాక్సైట్ కదలికలు తగ్గుముఖం పట్టడంతో ఆయన వల్లనే బాక్సైట్ జిఓ ఆగిందని ఏజెన్సీ అంతటా అనుకున్నారు. అదే సమయంలో ఏజెన్సీలోని టిడిపి నేతలు కూడా పవన్ మాటలను పరిగణలోకి తీసుకుని బాక్సైట్ తవ్వకాలపై ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని గిరిజనులకు మనోధైర్యం కన్పించాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం మొదలుపెట్టేలోగా, మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలపై ప్రజల్లో చర్చ జరగాలని ప్రకటించారు. దీంతో మళ్లీ గిరిజనుల్లో ఆందోళన మొదలైంది. 97 జిఓను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న అభిప్రాయానికి వచ్చారు. వెంటనే గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటైన పీసా కమిటీలకు ఉన్న అధికారాన్ని ఉపయోగించడానికి నిర్ణయించుకున్నారు. జెర్రల, రాళ్ళగడ్డ, గైగంపల్లి పంచాయతీలకు చెందిన పీసా కమిటీలు సోమవారం సమావేశమై బాక్సైట్ తవ్వకాలు జరపరాదని తీర్మానించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు అటవీ శాఖ ఉన్నతాధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి.
పీసా చట్టం ఏం చెపుతోంది?
పీసా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం కింద ప్రతి పంచాయతీలో ఒక కమిటీ ఏర్పడుతుంది. ఏజెన్సీలో తలెత్తే ప్రధాన సమస్యలపై ఈ కమిటీ స్పందిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీలోని ఖనిజాలను తవ్వితీయాలంటే విధిగా పీసా కమిటీ, గ్రామసభ ఆమోదాలు ఉండాలి. వీటి తీర్మానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇప్పటి వరకూ వ్యవహరించలేదు. దీన్ని ఆధారంగా చేసుకుని పీసా కమిటీలు సోమవారం తీర్మానం చేశాయి. ఏజెన్సీలోని అన్ని పంచాయతీల్లో ఇటువంటి తీర్మానాలు చేయాలని నిర్ణయించాయి. ఇదే జరిగితే, ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాలకు చట్టపరంగా అవరోధం కలిగే అవకాశాలు ఉన్నాయి.