రాష్ట్రీయం

కొలిక్కివచ్చిన పంపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండోవారానికి ఉద్యోగుల విభజన పూర్తి

ఇరువురు సిఎస్‌లతో కమలనాథన్ కమిటీ భేటీ వివాదాలకు అతీతంగా సమస్యల పరిష్కారం ఏకీకృత సర్వీసులపై దాదాపు స్పష్టత వ్యక్తిగత అభ్యంతరాలపైనా కమిటీ చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన సిఆర్ కమలనాథన్ కమిటీ 15వ సమావేశం ఆంధ్ర సచివాలయం ఎల్ బ్లాక్‌లో సోమవారం జరిగింది. భేటీలో రెండు రాష్ట్రాల సిఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ సహా కమలనాథన్ కమిటీలో సభ్యులుగావున్న వి నాగిరెడ్డి, డాక్టర్ పివి రమేష్, ఎపి పునర్విభజన సెల్ కార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ పునర్విభజన సెల్ కార్యదర్శి రామకృష్ణారావులు హాజరయ్యారు. ఉద్యోగుల పునర్విభజన ప్రక్రియ, పురోగతిపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను కమిటీ జారీ చేసి, తదనుగుణంగా సిబ్బంది పునర్విభజన చర్యలను చేపట్టాల్సిందిగా రాష్ట్రాస్థాయి అధికారులను ఆదేశించింది. వ్యక్తిగతంగా కొంతమంది అధికారులు ఇచ్చిన పిటిషన్లను కూడా కమిటీ పరిశీలించి నిర్ణయాలను ప్రకటించింది. స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్సు, ఇతర శాఖలకు సంబంధించి ఉన్న చిన్నచిన్న సాంకేతిక అంశాలపైనా ఇరు రాష్ట్రాల సిఎస్‌లు త్వరలో కూర్చుని తగిన నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది. అన్ని శాఖల ఉద్యోగుల విభజనపై రెండువారాల్లో మరింత స్పష్టత వస్తుందని కమిటీ పేర్కొంది. ప్రభుత్వోద్యోగులను ఐదు క్యాటగిరిలుగా విభజించిన కమిటీ ఒక్కోస్థాయిలో వివిధ శాఖల్లో పరిస్థితిని అధ్యయనం చేసింది. సచివాలయ స్థాయి శాఖల్లో సిబ్బంది, శాఖాధిపతుల కార్యాలయాల్లో సిబ్బంది, ప్రత్యేక కార్యాలయాలు, సంస్థలు, రాష్టస్థ్రాయి కార్యాలయాలు, ప్రధాన అభివృద్ధి పథకాల అమలు సిబ్బంది కింద ఉద్యోగులను పరిగణించి ఉద్యోగ విభజనపై చర్చించింది. ఇప్పటికే దాదాపు 51 శాఖల్లో సిబ్బందిపై స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఉద్యోగుల విభజనలో వచ్చిన అభ్యంతరాలపై ఇరు రాష్ట్రాల సిఎస్‌లు కమిటీకి వివరించారు. సచివాలయంలోని 26 శాఖలకు సంబంధించి కూడా మరోమారు చర్చ జరిగింది. నాల్గవ తరగతి సిబ్బంది విభజనపైనా కమిటీ దృష్టికి అభ్యంతరాలు వచ్చాయి. తక్షణమే ఆంధ్ర ఉద్యోగులను స్థానికత ప్రాతిపదికగా అక్కడికి పంపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు చేసిన డిమాండ్‌ను సిఎస్ రాజీవ్‌శర్మ కమిటీ దృష్టికి తెచ్చారు. ఆంధ్రలో పరిస్థితులపై సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. సచివాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలకు సంబంధించి ఇప్పటికే రికార్డులు సిద్ధమయ్యాయి. ఆయా శాఖాధిపతులు ఇప్పటికే తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో, ఆయా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆంధ్రకు చెందినవారని భావిస్తోన్న ఉద్యోగులు కొంతమంది తెలంగాణ స్థానికతను క్లెయిమ్ చేయడంపైనా చర్చ జరిగింది. ఆర్థికశాఖ, గణాంక శాఖ, పశుసంవర్థక శాఖ, మైనార్టీ సంక్షేమం, పాఠశాల విద్య, విద్యుత్, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ, రోడ్లు భవనాలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, రెవిన్యూ, సాంఘిక సంక్షేమం, ఆహారం -పౌర సరఫరాల శాఖ, యువజన పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖలపైనా స్పష్టత వచ్చిందని తెలిసింది.
రెండోవారంలో జాబితా
దాదాపు అన్ని శాఖల్లో ప్రక్రియ కొలిక్కివచ్చిందని, ఈనెల రెండోవారంలో శాఖలవారీ ఉద్యోగుల విభజనపై జాబితా విడుదల చేయనున్నట్టు కమలానాథన్ కమిటీ హామీ ఇచ్చినట్టు భేటీ అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పినట్టు సమాచారం. ఉద్యోగుల విభజన ప్రక్రియ నవంబర్ నెలాఖరుకు పూర్తిచేయకపోతే ఆందోళన బాట పడతామని టిఎన్జీవోలు, టిజెఎ సంఘాలు గత నెల కమలనాథన్ కమిటీని కలిసి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆందోళన చేయాల్సిన అవసరం రాకుండానే నవంబర్ నెలాఖరుకు ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ మొదటివారంలో శాఖలవారీ జాబితాలను ప్రకటించనున్నట్టు కమిటీ హామీ ఇచ్చింది. దీంతో ఆందోళన కార్యక్రమాన్ని టిఎన్జీవో, టిజిఎలు డిసెంబర్ రెండోవారానికి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు పెట్టిన గడువు తీరిపోనుండటంతో సోమవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు ఇరువురూ కమలనాథన్ కమిటీతో సమావేశమయ్యారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూరె్తైందని, శాఖలవారీ రూపొందించిన జాబితాలను విడుదల చేయడం ఒక్కటే మిగిలిందని కమలానాథన్ కమిటీ హామీ ఇవ్వడంపట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఉద్యోగ సంఘాల నేతల సమాచారం.