రాష్ట్రీయం

నిబంధనలు ఉద్యోగులకు వర్తించవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డయల్ యువర్ ఇఓలో భక్తురాలి ప్రశ్న
తిరుమల, డిసెంబర్ 4: తిరుమలలో పవిత్రతను కాపాడటం కోసం టిటిడి అమలుచేస్తున్న నిబంధనలు భక్తులకేనా? టిటిడి ఉద్యోగులకు, ఇతరులకు కూడా వర్తిస్తాయా అని బెంగళూరుకి చెందిన అరుణ అనే భక్తురాలు డయల్ యువర్ ఇ ఒ కార్యక్రమంలో ఇ ఒ ను ప్రశ్నించింది. శుక్రవారం తిరుమల్లోని అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఇ ఒ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా భక్తురాలు అరుణ మాట్లాడుతూ ఆలయ నాలుగు మాడ వీధుల్లో పాదరక్షలతో తిరగవద్దని, తలలో పువ్వులు ధరించవద్దని పవిత్రతను కాపాడమని టిటిడి పెట్టిన నిబంధనను భక్తులు పాటిస్తున్నారని, అయితే టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులు ఇతరులు పాటించడంలేదని తెలిపారు. దీనిని తాము ప్రశ్నిస్తే మేం ఆలయంలోకి వెళ్లడం లేదు.. వెళ్లు అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని రూల్ ఫర్ ఆల్ కాదా అని ఆమె ఇఒను ప్రశ్నించారు. ఈసందర్భంగా ఇ ఒ డాక్టర్ సాంబశివరావు అనుమతితో సివిఎస్‌ఓ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ తిరుమలలో టిటిడి పెట్టిన నిబంధన ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని ఇందులో అనుమానం లేదన్నారు. అయితే టిటిడి విజిలెన్స్, భద్రతా సిబ్బంది, పోలీసులు పాదరక్షలతో తిరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఇప్పుడు మీరిచ్చిన సమాచారంతో తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాదుకు చెందిన భవిత అనే మహిళ మాట్లాడుతూ ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఉంటే బాగుంటుందని, అలాగే కంపార్ట్‌మెంట్‌లో దర్శనం ఎప్పుడు అవుతుందో తెలిపే సమాచారాన్ని టివిల్లో డిస్‌ప్లే చేస్తే బాగుంటుందని కోరారు. స్వామివారి వస్త్రం కావాలంటే ఎలా పొందాలో తెలపాలని ఇఓను కోరారు. ఈసందర్భంగా ఇ ఒ సాంబశివరావు మాట్లాడుతూ కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు అందరు కలిసి క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారని, వారిని విడదీయడం సరికాదన్నదే తమ అభిప్రాయమన్నారు. అంతేకాకుండా స్థలాభావం ప్రభావంతో కూడా మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. ఇక దర్శన సమయాన్ని తెలియజేసే విధంగా టైం డిస్‌ప్లేని కంపార్ట్ మెంట్లలోని టి విల్లో చేయిస్తామన్నారు.