రాష్ట్రీయం

డిప్యూటీ తహసీల్దార్ల విధులను ప్రకటించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ తహసిల్దార్లకు ఇటీవల గెజిటెడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వారికి ఇప్పటికే ఉన్న విధులకు అదనంగా కొత్త విధులను అప్పగించింది. ఈ మేరకు సోమవారం జివో జారీ చేసింది. నిర్ణీత గడువు మేరకు మీ సేవా దరఖాస్తులను పరిష్కరించడం, ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం, మండల ఆర్‌ఐలు, గ్రామ సహాయకులు, గ్రామ సేవకులు, ఇతర కిందిస్థాయి సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉండడం, 15 రోజుకోసారి టూర్ డైరీని సమీక్షించడం, ఎమ్మార్వో సమక్షంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం, ప్రోటోకాల్ విధులకు హాజరు కావడం, చెట్ల నరికివేతను అడ్డుకోవడం, సర్వే మార్క్‌లను పరిశీలించడం, భూముల ఆక్రమణలు గురికాకుండా చూడ్డం, ఆదాయాన్ని పెంచేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని అనుసరించి ఉన్న విధులను నిర్వహించడం, జమాబందీ లెక్కలు పరిశీలించడం, జనన, మరణ ధృవీకరణ జాబితాలను పర్యవేక్షించడం, చౌకధరల దుకాణాలు, రైస్ మిల్లులను పర్యవేక్షించడం, ల్యాండ్ లైసెన్స్డ్ సర్ట్ఫికెట్ల చట్టం 2011ను అనుసరించి విచారణలు చేపట్టడం, ఎల్‌ఇసిలను జారీ చేయడం వంటి విధులను నిర్వహించవచ్చని ప్రభుత్వం జివోలో పేర్కొంది. ఇందుకు సంబందించి తక్షణ చర్యలను చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.