రాష్ట్రీయం

దానం..డోలాయమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిలపక్ష సమావేశానికి హాజరు * పార్టీ నేతల ఆశ్చర్యం * కంగుతిన్న టిఆర్‌ఎస్ వర్గాలు

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు దానం నాగేందర్ శనివారం అనూహ్యంగా కాంగ్రెస్ తరఫున అఖిలపక్ష సమావేశానికి హాజరై పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేశారు. పార్టీ ఫిరాయించే విషయంలో దానం నాగేందర్ ఇంకా డోలాయమానంలో ఉన్నట్లు అనుచరులు భావిస్తున్నారు. దానం పార్టీ ఫిరాయించనున్నట్లు చాలాకాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు రోజులుగా దానం తన ముఖ్య అనుచరులతో సమావేశమై టిఆర్‌ఎస్‌లో చేరే అంశంపై మంతనాలు జరిపారు. టిఆర్‌ఎస్‌లో చేరిన పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ అభిప్రాయాన్ని కూడా సేకరించారు. ఈలోగా శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ శుక్రవారం దానం నివాసానికి వెళ్ళి చర్చించడం, ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని దానం ఆయనకు చెప్పారు. పార్టీ మారకపోతే రాజకీయ భవిష్యత్తు లేదన్న భావనతో ఆయన ఉన్నారు. రాబోయే మూడేళ్ళ వరకూ పార్టీలో కొనసాగినా, ఆ తర్వాత (2019) కూడా పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదన్న దిగులు దానంలో కనిపిస్తున్నది. పార్టీ మారకపోతే మూడేళ్ళ వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే అది కాంగ్రెస్‌లో ఉంటే సాధ్యం కాదని ఆయన అనుయాయులు చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరితే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని సునాయసంగా గెలుపొందవచ్చని అంటున్నారు.
ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తే, భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదన్న ఆలోచనను దానం చేస్తున్నారు. గతంలో అంటే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టిక్కెట్ రాకపోవడంతో టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. తెల్లారే సరికి దానం పార్టీ ఫిరాయించడం కలకలం రేపింది. కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, టిడిపి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోవడంతో కొన్ని రోజులకే దానం మళ్లీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు అలా ఉండదని, పార్టీ ఫిరాయిస్తే ఇక మంచైనా, కాకపోయినా అక్కడే ఉండిపోవాల్సి ఉంటుందని, వెనక్కి వస్తే నవ్వులపాలు అవుతామన్న భయం ఆయన్ను వెంటాడుతున్నది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమూ ఆయనలో కనిపించడం లేదు.
రేపు టిఆర్‌ఎస్‌లోకి?
దానం నాగేందర్ సోమవారం (7న) టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. దానం మాత్రం ఇదేమి పట్టించుకోనట్లుగా గ్రేటర్‌లో డివిజన్ల రిజర్వేషన్లు, ఓట్ల తారు-మారు అంశం శనివారం జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరై, పార్టీ సీనియర్ నేతలకు హమ్మయ్య అని ఊపిరి తీసుకునే అవకాశాన్ని కల్పించారు. దానం పార్టీ ఫిరాయించరని షబ్బీర్ అలీ బలంగా చెబుతున్నారు.