రాష్ట్రీయం

దా‘రుణ’ మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కేంద్రంగా ఘరానా దందా
తక్కువ వడ్డీకి బ్యాంకు రుణమిస్తామంటూ గేలం
టెలీ కాలర్స్ సాయంతో టోపీ రెండు కోట్లకు పైగా వసూలు
ముగ్గురి అరెస్టు: 8 లక్షలు స్వాధీనం
హైదరాబాద్, డిసెంబర్ 3: ఢిల్లీ కేంద్రంగా రుణాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్ క్రైం పోలీసులకు పట్టుబడింది. తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామంటూ దేశవ్యాప్తంగా 200మంది టెలికాలర్స్‌ను నియమించుకొని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు మోసగాళ్లు హైదరాబాద్ క్రైం పోలీసులకు చిక్కారు. రుణాల మంజూరు కోసం కొంత ఫీజు, వివిధ డాక్యుమెంట్ల ఖర్చుల నిమిత్తం డిపాజిట్‌లు చేయించుకొని మోసానికి పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 8లక్షలు నగదు, ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు నగర జాయింట్ కమిషనర్ (డిటెక్టివ్) ప్రభాకర్‌రావు తెలిపారు. న్యూఢిల్లీ కేంద్రంగా అమాయకులను మోసం చేస్తున్న ప్రియాంష్ ఫౌండేషన్, డయల్ ఈజీ నెట్‌వర్కు ప్రైవేటు లిమిటెడ్, కేర్ ఇండియా ఫౌండేషన్ సంస్థల ద్వారా వందలాది అమాయకులకు దాదాపు రూ. 2 కోట్లు కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తుందని జెసి ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం నగరంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని గన్‌ఫౌండ్రికి చెందిన వ్యాపారి నిశ్చల్ నరేంద్ర ప్రసాద్‌కు అక్టోబర్ 17న, నేహ గుప్తా పేరిట ఒక కాల్ వచ్చిందని, తక్కువ వడ్డీతో కొటక్ మహేంద్ర బ్యాంక్‌లో రుణ సౌకర్యం కల్పిస్తామని నమ్మబలికింది. పది లక్షల రుణానికి గానూ ప్రాసెసింగ్, మార్టిగేషన్ వంటి చార్జీలు చెల్లించాల్సి ఉంటుందంటూ రూ. 2,38,232లను డిపాజిట్ చేయించుకుంది. తరువాత రుణం కోసం ఫోన్ చేయగా స్పందించకపోవడంతో మోసపోయానంటూ ఫిర్యాదు చేసినట్టు జెసి తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం బృందం నేహ గుప్త ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా తిలక్‌నగర్, ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడిపినట్టు తెలిసిందని, దీంతో తమ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాన నిందితులు మనీష్ టాండాన్, పునీత్ ముఖిజాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వారిపై పిడి యాక్టు పెట్టనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా మరో కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ముంబాయి కేంద్రంగా హర్బల్ ఆయిల్ వ్యాపారంలో మంచి లాభాలు గడించొచ్చంటూ ముగ్గురు నైజీరియన్లను కూడా అరెస్టు చేసి ఐసిసిఐ బ్యాంకులో వారి ఖాతాలు రూ. 3,0400లను ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు. వీరిలో జాన్ డి సౌజ, హేమంత్ అనంత్ గొటాడ్, అమోల్ బాబన్‌రావు మోహిత్ ప్రధాన నిందితులని పేర్కొన్నారు. మిస్ కైరా జస్టిన్ మహిళ డేవిడ్ అనే వ్యాపారికి ఫేస్ బుక్‌లో పరిచయమైంది.
దీంతో హర్బల్ ఆయిల్ వ్యాపారంలో మంచి లాభాలుంటాయని నమ్మించింది. ఒక లీటరు ఆయిల్ 14,500యుఎస్ డాలర్లు అని, ఇది మార్కెట్‌లోరూ.26,500లకు లభిస్తుందనడంతో డేవిడ్ నమ్మాడు. మొదటి లీటరు బాటిల్ ఆయిల్‌ను డెలివరీ చేసిన నమ్మకంతో మరో పది బాటిళ్లకు ఆర్డరు చేశాడు. దీనికి రూ. 4,73,500లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశాడు. పది లీటర్లు ఆయిల్ రాకపోగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైం పోలీసులు ముంబాయి వెళ్లి వారిని అరెస్టు చేశారని, వారిపై చీటింగ్ కేసులతోపాటు పిడి యాక్టును కూడా పెట్టనున్నట్టు జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు వివరించారు.