రాష్ట్రీయం

పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొబైల్ బృందాలతో నిఘా పోలింగ్‌ను వీడియో తీద్దాం
కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు భన్వర్‌లాల్ ఆదేశం
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, డిసెంబర్ 6: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న జిల్లాల అధికారులతో ఆదివారం భన్వర్‌లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని, అవసరమైన చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మెక్రో అబ్జర్వర్లు, సెక్టోరల్ అధికారులను నియమించుకుని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించారు.