రాష్ట్రీయం

‘వచ్చే ఏడాది నుంచి పత్తికి గిట్టుబాటు ధర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 7: రాష్ట్రంలోని పత్తి రైతులకు వచ్చే ఏడాది నుండి గిట్టుబాటు ధర పెంపు విషయం కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర జౌళి శాఖ అదనపు కార్యదర్శి పుష్పసుబ్రహ్మణ్యం అన్నారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ఈ ఏడాదిలో గిట్టుబాటు ధర ఉండబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో రైతులకు ఉన్న సౌకర్యాలు, మార్కెట్ పరిస్థితులను పరిశీలించారు. గన్నీ సంచుల్లో తెచ్చిన పత్తిని సైతం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె తెలిపారు. రైతులు తెచ్చిన పత్తి నాణ్యతను బట్టి ధర విషయంలో రైతులను అడిగి తెలుసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి గోడును వెల్లబుచ్చుకున్నారు. తాము తెచ్చిన పత్తికి మద్దతు ధర 5వేలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్ కమిషనర్ పుష్పసుబ్రహ్మణ్యం సమీపంలో ఉన్న కలెక్టర్ వాకాటి కరుణ జోక్యం చేసుకొని రైతులతో మాట్లాడారు. పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తగిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారికి నచ్చచెప్పారు. ఆమె వెంట భారత పత్తి సంస్థ చైర్మన్ డికె మిశ్రా, అడిషనల్ కమిషన్ డైరెక్టర్ లక్ష్మీభాయ్, జెడి ఏ శ్రీనివాస్, కార్యదర్శి రాజునాయక్ తదితరులు ఉన్నారు.