రాష్ట్రీయం

ఓయులో యథాతథ స్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిటీ సివిల్ కోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 7: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించ తలపెట్టిన బీఫ్, ఫోర్క్ ఫెస్టివల్స్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఎలాంటి ఫెస్టివల్స్‌ను ఓయులో అనుమతించవద్దని కూడా కోర్టు స్పష్టం చేసింది. నగరానికి చెందిన అడ్వకేట్ జనార్థన్ గౌడ్ దాఖలు చేసిన ఇంజక్షన్ సూట్‌పై విచారణ చేపట్టిన సిటీ కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఫెస్టివల్స్‌ను నిర్వహించేందుకు విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేయడం సరికాదని, దీని వల్ల వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతింటాయని జనార్థన్‌గౌడ్ తన సూట్‌లో పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తి నగరంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుందని తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం, గోవధ చట్టాల ఉల్లంఘన కూడ ఈ ఫెస్టివల్స్ వల్ల జరుగుతోందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.