రాష్ట్రీయం

అదనపు నిధులివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చివరకూ అడగవద్దని ఆర్థికశాఖ సర్క్యులర్

హైదరాబాద్, నవంబర్ 22: మితిమీరిన ఖర్చులను నియంత్రించేందుకు ఆర్ధిక శాఖ రాష్ట్రంలోని అన్ని శాఖలకూ సర్క్యులర్ జారీ చేసింది. ఇటీవల సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్ధిక సంవత్సరం ముగిసే వరకు అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పంపొద్దని, నిధుల దుబారాకు చెక్ పెట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే పంపిన ప్రతిపాదనలకు లోబడి నిధులు ఖర్చు చేయాలని, అదనపు నిధులపై ఆశలు వద్దని సర్క్యులర్‌లో కోరింది. రాష్ట్ర విభజన తర్వాత 16వేల కోట్లు రెవెన్యూ లోటు తలెత్తింది. గత మూడు నెలల్లో ఎడాపెడా నిధులు ఖర్చు పెట్టకుండా ఆర్ధిక శాఖ ఎప్పటికప్పుడు అన్ని శాఖలను హెచ్చరిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి నిధులకు కోత విధించకుండా చూస్తున్నట్టు ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. సాధారణంగా కొన్ని శాఖలు అత్యవసర పరిస్థితుల్లో అదనపు నిధులు కావాలని ఆర్ధిక శాఖను కోరతాయి. కానీ పరిమితికి మించి నిధులు కావాలంటే మంజూరు చేసే అవకాశాలు లేవని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ లోటునుంచి బయటపడాలంటే కఠినమైన ఆంక్షలు తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 43శాతం మేర వేతనాలు పెంచారు. గోదావరి పుష్కరాలు, హుదూద్ తుపాను వ్యయం ఖజానాను మింగేశాయి. గోదావరి పుష్కరాలకు రూ.300 కోట్లు చాలనుకుంటే ఎకాఎకిన రూ.1600 కోట్లు ఖర్చయ్యాయి. హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు రూ.1400 కోట్లు ఖర్చుపెట్టారు. కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, కేవలం రూ.650 కోట్లు ఇచ్చి దులుపుకుంది. అమరావతి రాజధాని శంకుస్ధాపన, అంతకుముందు, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు, పర్యటనలకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చయింది. ఈ ఆర్ధిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగుస్తుంది. అందుకే ఆర్ధికంగా ఆంక్షలు విధించి నిధుల దుబారాను నిరోధించేందుకు ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలు జారీచేసినట్టు ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.