రాష్ట్రీయం

నల్లగొండ టిఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నప్పరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ జిల్లా టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నప్పరెడ్డి పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసి చర్చించారు. అనంతరం చిన్నప్పరెడ్డి పేరును ముఖ్యమంత్రి ఖరారుచేశారు. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నల్లగొండ జిల్లా నుంచి మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయనుండగా, టిఆర్‌ఎస్ నుంచి బలమైన అభ్యర్థిగా చిన్నప్పరెడ్డిని రంగంలో నిలిపారు. మిగిలిన అభ్యర్థులను వరుసగా దశల వారిగా ప్రకటించనున్నారు. మొత్తం 12 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.